జాన్వీపై `పెద్ది` టీమ్ సైలెంట్ వార్..!

admin
Published by Admin — June 09, 2026 in Movies
News Image

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్(Ram Charan), క్రేజీ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నా.. తెర వెనుక మాత్రం ఊహించని వివాదం రాజుకుంటోంది. ముఖ్యంగా చిత్ర కథానాయిక జాన్వీ కపూర్ వ్యవహార శైలి ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, చిత్ర యూనిట్‌కు.. జాన్వీకి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందనే ప్రచారం ఫిలింనగర్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘థ్యాంక్యూ మీట్’ ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది.

సాధారణంగా ఒక సినిమా సక్సెస్ అయితే హీరోయిన్లు సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురిపిస్తారు. కానీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) మాత్రం ‘పెద్ది’ సక్సెస్‌పై కనీసం ఒక్క పోస్ట్ కూడా పెట్టకపోవడం గమనార్హం. సినిమా ప్రీమియర్ షోల సమయం నుండి తన పాత్రపై వ‌చ్చిన నెగ‌టివిటీపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు టాక్. సినిమాలో ‘అచ్చియమ్మ’గా జాన్వీ నటన కంటే, ఆమె శరీర సౌందర్యాన్నే ఎక్కువగా హైలైట్ చేశారంటూ నెటిజన్లు విమర్శలు గుప్పించడంతో జాన్వీ హర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దర్శకుడు బుచ్చిబాబు స్వయంగా పబ్లిక్ అపాలజీ చెప్పినప్పటికీ జాన్వీ శాంతించలేదు సరికదా, మూవీ టీమ్ చేస్తున్న ఫోన్ కాల్స్‌కు కూడా రెస్పాండ్ కావడం లేదని ఇండస్ట్రీ టాక్.

జాన్వీ ఇగోయిస్టిక్ బిహేవియర్ ప్రదర్శిస్తోందని భావించిన ‘పెద్ది(Peddi)’ టీమ్.. ఇక ఆమెను బ్రతిమాలడం వేస్ట్ అని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. అందుకే హైదరాబాద్ థ్యాంక్యూ మీట్‌లో చిత్ర యూనిట్ మొత్తం ఒక స్ట్రాటజిక్ సైలెన్స్ పాటించింది. రామ్ చరణ్ మొదలుకొని దర్శకుడు బుచ్చిబాబు, జగపతిబాబు, నిర్మాతలు రవి, శశి.. ఇలా వేదికపై మాట్లాడిన వారెవరూ కనీసం ఫార్మాలిటీకి కూడా జాన్వీ పేరు ఎత్తలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్క్రీన్స్‌పై నామమాత్రంగా ఆమె పోస్టర్లు కనిపించినా, స్పీచ్‌లలో మాత్రం ఆమెను పూర్తిగా పక్కన పెట్టేశారు.

ఈ సైలెంట్ వార్ ఇక్కడితో ఆగేలా లేదు. త్వరలోనే వైజాగ్ లో ప్లాన్ చేస్తున్న గ్రాండ్ సక్సెస్ మీట్‌కు కూడా జాన్వీ వచ్చే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. అయితే, సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా కేవలం పర్సనల్ ఈగోల కారణంగా జాన్వీ ఇలా ప్రమోషన్స్‌కు దూరంగా ఉండటం, టీమ్‌ను లైట్ తీసుకోవడం ఆమె టాలీవుడ్(Tollywood) కెరీర్‌కు మైనస్ అయ్యే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో టాలీవుడ్ పెద్ద ప్రాజెక్టులకు ఆమెను కన్సిడర్ చేయాలా వద్దా అనే ఆలోచనలో నిర్మాతలు పడే అవకాశం ఉంది. మరి ఈ వివాదం ఇక్కడితో సర్దుమణుగుతుందో లేక మరింత ముదురుతుందో చూడాలి.

Tags
Peddi Janhvi Kapoor Ram Charan Buchi Babu Sana Tollywood Telugu Movies Latest News
Recent Comments
Leave a Comment

Related News