వాట్సాప్ ఎందుకు బ్యాన్ చేయలేదు?

admin
Published by Admin — June 17, 2026 in Andhra
News Image

మీరు టెలిగ్రామ్ యాప్‌ను వినియోగిస్తున్నారా? దాని ద్వారా సందేశాలు.. స‌మాచారం పంచుకుంటున్నా రా? అయితే.. ఈ యాప్‌ను దేశంలో నిషేధిస్తూ.. కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ నెల 22వ తేదీ వ‌ర‌కు.. ఈ యాప్‌పై నిషేధం విధిస్తున్నట్టు తాజాగా కేంద్ర హోం శాఖ నిర్ణ‌యం తీసుకుని ఆ మేర‌కు ప్ర‌క‌ట‌న జారీ చేసింది. ఈయాప్ వినియోగ‌దారులు.. ఈ కాలానికి సంబంధించి.. వేరే యాప్‌ల ను వినియోగించుకోవాల‌ని కేంద్రం సూచించింది.

రీజ‌నేంటి?

ప్ర‌స్తుతం దేశాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న స‌మ‌స్య వైద్య విద్య ప్ర‌వేశాల‌కు సంబంధించిన నీట్ ప‌రీక్ష ప్ర‌శ్న పత్రం లీక్ కావ‌డ‌మే. గ‌త నెల‌లో నిర్వ‌హించిన నీట్ ప్ర‌వేశ ప‌రీక్ష ప్ర‌శ్న ప‌త్రం లీకైంది. దీంతో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న కేంద్ర ప్ర‌భుత్వం.. ఈ నెల 21న నిర్వ‌హించ‌నున్న రీ ఎగ్జామ్‌కు సంబంధించి కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. దీనిలో భాగంగానే టెలిగ్రామ్ యాప్‌ను నిషేధిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. అంతేకాదు.. ఈ యాప్‌ను ఫోన్ల‌లో నుంచి డిలీట్ చేయాల‌ని కూడా సూచించింది.(ఇది సూచ‌న మాత్ర‌మే).

ఎందుకు?

గ‌త నెల‌లో నిర్వ‌హించిన నీట్ ప‌రీక్ష ప్ర‌శ్న‌ప‌త్రం.. టెలిగ్రామ్ యాప్ ద్వారానే లీకైంద‌ని అధికారులు గుర్తించారు. ఎక్క‌డో యూపీ, పంజాబ్‌, రాజ‌స్థాన్‌, మ‌హారాష్ట్ర‌ల‌లో ఈ యాప్‌ను వినియోగించి.. ప్ర‌శ్న‌ప‌త్రా న్ని బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చార‌ని నిఘావ‌ర్గాలు తెలిపాయి. దీంతో ఈ నెల నిర్వ‌హించ‌నున్న రీ ఎగ్జామ్ లో ఇలాంటి స‌మ‌స్య‌లు రాకుండా చేసేందుకు.. నిషేధం విధించారు.

ఇత‌ర యాప్‌ల‌పై కూడా..

టెలిగ్రామ్ యాప్‌ను నిషేధించిన కేంద్రం.. ఇత‌ర యాప్‌లైన వాట్సాప్‌, ఎక్స్‌, ఇన్‌స్టా, ఫేస్ బుక్‌ స‌హా అన్నింటిపైనా నిఘా ఉంచింది. ఇవి కొంత మేర‌కు భ‌ద్ర‌తా ఫీచ‌ర్ల‌ను పాటిస్తుండ‌డం.. నిఘా ఉంచేం దుకు అవ‌కాశం ఉండ‌డంతో వాటిని నిషేధించ‌లేదు. కానీ, నిఘా మాత్రం కొన‌సాగుతుంద‌ని పేర్కొంది. ఈ మేర‌కు ఆయా సంస్థ‌ల‌కు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తేడా వ‌స్తే.. వాటిని పూర్తిగా నిషేధించేందుకు కూడా వెనుకాడ‌బోమ‌ని చెప్పిన‌ట్టు జాతీయ మీడియా పేర్కొంది.

ప‌క్కా ఏర్పాట్లు..

ఈ నెల 21న నిర్వ‌హించ‌నున్న నీట్ రీ ఎగ్జామ్‌ను ప‌క్కాగా నిర్వ‌హించేందుకు కేంద్ర విద్యాశాఖ‌, హోం శాఖ సంయుక్తంగా కార్యాచ‌ర‌ణ చేప‌ట్టాయి. దీనిలో భాగంగా.. పశ్న ప‌త్రాల‌ను మిలిట‌రీ భ‌ద్ర‌తతో రాష్ట్రా ల‌కు పంపిస్తున్నారు. సుదూర ప్రాంతాల‌కు వాయుసేన‌(సైన్యంలో భాగం) స‌హకారం తీసుకుంటున్నారు. అలానే.. ప‌శ్న ప‌త్రం ఉన్న రూమ్‌ల వ‌ద్ద‌.. మూడంచ‌ల్లో సీఆర్‌పీఎఫ్‌, పారిశ్రామిక భ‌ద్ర‌తా ద‌ళాలు, స్థానిక పోలీసుల‌ను ఉంచారు. అలానే.. ప‌శ్న ప‌త్రం రూపొందించిన 192 మంది విద్యాధికుల‌ను, నిపుణుల‌ను లాక్‌డౌన్ చేశారు. 

Tags
WhatsApp facebook ban NEET reason
Recent Comments
Leave a Comment

Related News