తమిళనాడు సీఎం, హీరో విజయ్‌కు నటి త్రిషతో బ్రేకప్ అయ్యిందని ఇటు సోషల్ మీడియాలో, అటు మీడియాలో జోరుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాదు, ఇన్ స్టాలో కూడా విజయ్ ను త్రిష అన్ ఫాలో చేసిందని, వారిద్దరికీ బ్రేకప్ అయిందని నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. ఇక, విజయ్ పుట్టినరోజు సందర్భంగా కనీసం త్రిష విషెస్ కూడా చెప్పలేదని, కాబట్టి వారిద్దరి రిలేషన్ షిప్ పై వస్తున్న పుకార్లు నిజమేనని అంతా అనుకున్నారు.
అయితే, ఆ పుకార్లకు, ఊహాగానాలకు త్రిష తెరదించింది. విజయ్ కు బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో త్రిష చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. అన్నింటికీ విలువనిచ్చే వ్యక్తికి.. HBD 00.00 అని క్యాప్షన్ పెడుతూ ఇన్ స్టాలో త్రిష చేసిన పోస్ట్ తో ఆ పుకార్లకు తెరపడింది. '00.00' అని మెన్షన్ చేయడంతో జూన్ 22న అర్ధరాత్రి 12 గంటలకే తాను విజయ్‌కు విషెస్ చెప్పానని త్రిష క్లారిటీనిచ్చింది.