న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్(The Paradise)’. ‘దసరా’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి నుంచి వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న ఓ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
‘దసరా’ చిత్రంలో వెన్నెల పాత్రతో ప్రేక్షకులను కట్టిపడేసిన కీర్తి సురేష్(Keerthy Suresh), ఇప్పుడు అదే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. పెళ్లి తర్వాత, అది కూడా హీరోయిన్‌గా ఒక వెలుగు వెలుగుతున్న తరుణంలో, నాని సినిమా కోసం ఆమె తీసుకున్న ఈ షాకింగ్ డెసిషన్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఈ నిర్ణయం వెనుక బలమైన కారణమే ఉందంటున్నారు. నాని(Nani)తో ‘నేను లోకల్’ సినిమా చేసినప్పటి నుంచీ మంచి బాండింగ్ ఉండటం, అలాగే శ్రీకాంత్ ఓదెల టేకింగ్ మీద ఉన్న నమ్మకంతోనే కీర్తి ఈ స్పెషల్ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి తోడు రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటంతో ఈ మాస్ నంబర్ సినిమాకే బిగ్గెస్ట్ హైలైట్‌గా నిలవనుందని సమాచారం. కాగా, సినిమా షూటింగ్ ఆలస్యం అవుతున్నప్పటికీ, ఇలాంటి క్రేజీ అప్‌డేట్స్ బయటికి వస్తుండటంతో అభిమానుల్లో జోష్ మరింత పెరుగుతోంది. త్వరలోనే దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా క్లారిటీ ఇస్తే మాత్రం, సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్ రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం.