లైంగిక ఆరోపణల కేసులో ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి.. తన ఫ్యూచర్‌ను కోల్పోయే పరిస్థితి ఏర్పడిందా? ఆయన ఐపీఎస్ శిక్షణను రద్దు చేయాలంటూ.. ఉన్నతాధికారులు సిఫా ర్సు చేశారా? అంటే.. ఔననే అంటున్నారు అధికారులు. అనంతపురం జిల్లాకు చెందిన ఉదయ్.. గతంలో కానిస్టేబుల్‌గా పనిచేశారు. అయితే.. సర్కిల్ ఇన్ స్పెక్టర్ దూషించారన్న కారణంగా అకస్మాత్తుగా ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. దీంతో మంచి ఫ్యూచర్ ఉంటుందని అందరూ అనుకున్నారు.
కానీ, ట్రైనింగ్ సమయంలో మరో మహిళా ఐపీఎస్‌తో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం.. ఆమెపై దాడి చేయడం.. ఫోన్ లాక్కుని బెదిరింపులకు దిగడం వంటివి ఉదయ్ కృష్ణారెడ్డికి పెను చిక్కులు తెచ్చాయి. అయితే.. ఇప్పుడు మరిన్ని కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఆయనపై ఆత్మహత్య నేరం కింద కేసు నమోదైంది. లైంగిక వేధింపుల కేసు నమోదైన అనంతరం.. ఆయన పూటుగా మద్యం తాగి.. ఆత్మహత్యకు పాల్పడ్డానని చెప్పడంతో ఈ కేసు నమోదు చేశారు. తాజాగా ఆయన గదిలో తనిఖీలు చేసిన అధికారులకు.. మరిన్ని ప్రేమ లేఖలు, బెదిరింపు లేఖలు అందాయి.
ఇవన్నీ.. మహిళలతో ఉన్న వివాహేతర సంబంధాలేనని పోలీసులు తేల్చారు. ఇప్పుడు ఆ బాధితులను కూడా పిలిచి.. వాంగ్మూలం నమోదు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉదయ్ కృష్నారెడ్డి ఐపీఎస్ శిక్షణ ను రద్దు చేసేలా సిఫార్సు చేయాలని తెలంగాణ డీజీపీ పరిశీలిస్తున్నట్టు ఉన్నతాధికారులు చెబుతున్నా రు. శిక్షణ సమయంలోనే ఇన్ని ఆరోపణలు రావడం పెద్ద సంచలనమని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తాము ఆయన ఐపీఎస్ రద్దుకు సిఫార్సు చేయక తప్పడం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి?
అఖిల భారత సర్వీసుల నిబంధనలు కూడా శిక్షణ రద్దును సమర్థించనున్నాయి. ఇలాంటి ఘటనలు.. ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్‌ల శిక్షణా సమయంలో వచ్చే ఆరోపణలను కేంద్ర హోం శాఖ నిశితంగా పరిశీలిస్తుంది. గతంలో ఇలానే ఆరోపణలు ఎదుర్కొన్న నలుగురి శిక్షణలను (ముగ్గురు ఐఏఎస్, ఒక ఐపీఎస్) రద్దు చేసింది. తద్వారా వారు.. ఈ ఉద్యోగాలకు అనర్హులయ్యారు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఉదయ్‌కు కూడా ఎదురు కానుంది. మొత్తంగా ఎంత కష్టపడి సాధించినా.. దానిని నిలుపుకొనే విషయంలో ఉదయ్ చేసిన పొరపాట్లే ఇప్పుడు ఆయనకు శాపంగా మారాయని అంటున్నారు.