ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదెల కీలక పోస్టు చేశారు. తన భర్త బాటలోనే తాను కూడా నడుస్తున్నానని ఆమె పేర్కొన్నారు. రాజకీయాలేకాదు.. సమాజ సేవ, వన్యప్రాణుల సంరక్షణ వంటి విషయాల్లో పవన్ కల్యాణ్ ఆదర్శవంతమైన మార్గంలో వెళ్తున్నారని.. ఆయన వెంటే తాను కూడా నడుస్తున్నానని ఆమె స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ సతీమణిగా.. కొణిదల ఇంటి కోడలిగా రావడం తన భాగ్యమని ఆమె పేర్కొన్నారు.
ఇటీవల తన పుట్టిన రోజును పురస్కరించుకుని అన్నా కొణిదెల విశాఖపట్నంలోని జంతు ప్రదర్శన శాలలో ఒక ఏనుగును, పులిని దత్తత తీసుకున్నారు. వీటికి జీవిత కాలం అయ్యే వ్యయాన్ని ఆమె ఇవ్వనున్నారు. ఆహారం, వైద్యం, సంరక్షణ సహా.. ఇతర అవసరాలు ఏవివచ్చినా.. ఆమె నిధులు సమకూర్చనున్నారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని..ఆమె సోషల్ మీడి యాలో పోస్టు చేశారు. ఆ రెండు జంతువుల సంక్షరణకు ఏడాది 6.5 లక్షల రూపాయలు ఖర్చు కానుంది. దీనిని ఆమె అందించనున్నారు.
``పవన్ కల్యాణ్‌లో ఒక కోణమే కాదు. ఆయనలో అనేక భావాలతో కూడిన అనేక కోణాలు ఉన్నాయి. పుస్తకాలు చదువుతారు. విజ్ఞానం పెంచుకుంటారు. రాజకీయాలు చేస్తారు. సినిమాలు చేస్తారు. ప్రజలకు ఏదైనా చేయాలనితపిస్తారు. దీనితోపాటు ప్రకృతి సంపదను పరిరక్షించాలని నిర్ణయించారు. చెట్లు, జంతువులు.. ఇలా అన్ని విషయాల్లోనూ ఆయన మనసు పెట్టారు. అందుకే ఆయన సతీమణిగా ఆయన బాటలో నడుస్తున్నా. ఇది నాకు ఎంతో ఆనందంగా.. అంతకు మించి ఎంతో బాధ్యతగా ఉంది.`` అని అన్నా పేర్కొన్నారు.
అభిమానులు ఫిదా!
అన్నాకొణిదల పెట్టిన పోస్టుకు కొన్ని గంటల్లోనే వేలాది మంది అభిమానులు లైకులు కొట్టారు. ఆమె నిర్ణయాన్ని.. ప్రశంసించా రు. పవన్ కల్యాణ్ అడుగు జాడల్లో నడుస్తున్న అన్నాకు అభినందనలు తెలిపారు. ప్రకృతి-సమాజం వేరు కాదన్న పవన్ కల్యాణ్ ఫార్ములాను అక్షరాలా అమలు చేస్తున్న ఆయన అర్ధాంగిగా అన్నా అందరి హృదయాలను గెలుచుకున్నారని కొందరు వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే.. ఫ్యామిలీ కోసం కూడా అన్నా .. తనదైన విధంగా కష్టపడుతున్న విషయం తెలిసిందే.