కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని, ఆయన కుమారుడు చంద్రమోహన్ ను స్థానిక చిప్పగిరి పోలీసులు ఆదివారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో అరెస్టు చేశారు. ఇం టికి వెళ్లి.. తలుపులు బద్దలు కొట్టి మరీ వారిని అరెస్టు చేసినట్టు వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయి తే.. వైసీపీ నేతలు హంగామా చేస్తారన్న ఉద్దేశంతో తెల్లవారు జామున అరెస్టు చేయాల్సి వచ్చిందని చెబు తున్నారు. కాగా.. ఈ వ్యవహారంతో ఆలూరు నియోజకవర్గంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.
అసలు ఏం జరిగింది?
కర్నూలు జిల్లా వ్యాప్తంగా రాజకీయ కక్షలు, ప్రతీకార రాజకీయాలు కామనే. ఈ క్రమంలో ఆలూరు నియోజక వర్గంలోగత ఎన్నికల్లో జరిగిన ఘర్షణను ప్రస్తావిస్తూ.. ఇటీవల చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో వైసీ పీ నేత గిరి ఇంటిపై టీడీపీ స్థానిక నేత నాగరాజు, అతని అనుచరులు దాడి చేశారు. ఇరు పక్షాలు కూడా ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీనిపై టీడీపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడులు చేసుకోవద్ద ని ఏదైనా ఉంటే.. ప్రజల మధ్యకు తీసుకువెళ్లాని పార్టీ సూచించింది. అయితే.. అప్పటికే దాడి జరిగిపోయింది.
దీనిని మనసులో పెట్టుకున్న వైసీపీ నేత గిరి.. ఎమ్మెల్యే విరూపాక్షికి సమాచారం చేరవేశారు. ఫలితంగా ఇటు వైపు నుంచి కూడా ఎదురు దాడికి దిగారు. ఈ క్రమంలో విరూపాక్షి తమ్ముడు శ్రీరాముడు టీడీపీ నేత ల రాళ్ల దాడిలో గాయపడ్డాడు. ఇలా.. ఇరు పక్షాలు చేసుకున్న దాడి కారణంగా.. పలువురు బాధి తులు.. పరస్పరం కేసులు పెట్టుకున్నారు. అయితే.. ఎమ్మెల్యే విరూపాక్షి పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారని.. టీడీపీ నేతలు చెబుతున్నారు. తాము ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటూ ఆయన నిప్పులు చెరిగారని అంటున్నారు.
దీంతో ఎమ్మెల్యే వైఖరిపై అందిన ఫిర్యాదులో పోలీసులు రంగంలోకి దిగి విరూపాక్షిని, ఆయన కుమారు డు, ఇతర అనుచరులను అరెస్టు చేశారు. దీనిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. రాజకీయ ప్రేరేపిత వివాదంలో పోలీసులు అతి చేశారని వైసీపీ నాయకులు చెబుతుండగా.. తమను దూషించారు కాబట్టే.. కేసు పెట్టామని పోలీసులు అంటున్నారు. మొత్తంగా తెల్లవారు జామున అరెస్టు చేయడం, ఇంటి తలుపు లు విరగొట్టడం వంటివి వివాదానికి దారి తీశాయి. వైసీపీ నాయకులు ఆలూరు బంద్‌కు పిలుపునిచ్చారు. మరోవైపు పోలీసులు 144 సెక్షన్ విధించి వైసీపీ నేతలను అడ్డుకున్నారు.