వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు కన్రెర్ర చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ-2025 నియామకాల్లో అవక తవకలు జరిగాయని ఆరోపిస్తూ.. నిరసన చేస్తున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. అనుమతులు లేని దీక్షా శిబిరాలు, నిరసన శిబిరాలను తక్షణమే తొలగించే లా చూడాలని డీజీపీని ఆదేశించారు. ఎలాంటి బెదిరింపులకు, ఒత్తిడులకు పోలీసులు లొంగకూడదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే.. అణిచేయాలన్నా రు.
తాజాగా శనివారం ఉదయం మంగళగిరిలోని టీడీపీ కేంద్రకార్యాలయానికి వచ్చిన ఈ సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిస్థితులపై నాయకులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కర్నులు, అనంతపురం, కడపలలో జరుగుతున్న వైసీపీ నాయకుల నిరసనను పార్టీ నాయకులు చెప్పారు. దీనివల్ల సాధారణ ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. అంతేకాదు.. ఎలాంటి అనుమతులు లేకుండా వైసీపీ నాయకులు ధర్నాలు చేస్తుండడంతో శాంతిభద్రతలకు కూడా విఘాతం కలుగుతోందని పేర్కొన్నారు.
ఆయా విషయాలను లైవ్‌లోనే వీక్షించిన చంద్రబాబు.. గొడ్డలి పార్టీ అరాచకాన్ని అణిచేస్తాం.. అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. నిరసనలకు, ధర్నాలకు తాను వ్యతిరేకం కాదని.. కానీ, ఏదైనా ప్రజాస్వామ్య యుతంగాజరగాలని అన్నారు. లేనిపోని నిందలు, అవాకులుచెవాలకుతో ఇలా నిరసనలు చేపట్టి సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే.. ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పారు. రేపు కోర్టు ఏదైనా అడిగితే సమాధానం ఎవరు చెబుతారని.. ఆయన వ్యాఖ్యానించారు. అనుమతి ఉన్న ప్రాంతంలో నిరసనలు చేపడితే.. అది కూడా శాంతియుతం అయితే.. పోలీసులు అనుమతిస్తారని తెలిపారు.
ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా నిరసనలు చేస్తే ఊరుకోబోమని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. గొడ్డలి పార్టీ నిరసనల్లో రౌడీలు, గంజాయ్ బ్యాచ్‌లు తప్ప..ఒక్క డీఎస్సీ అభ్యర్థి అయినా ఉన్నారా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. వైసీపీ నిరసనలకు కౌంటర్‌గా కర్నూలులో కదం తొక్కినవారంతా మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన టీచర్లేనని వ్యాఖ్యానించారు. గొడ్డలి పార్టీ చేసే నష్టంతో టీచర్లు ఐక్యంగా తమ ఆత్మగౌరవం చాటారని బాబు చెప్పారు. ఈ క్రమంలోనే అనుమతి లేని నిరసనలను ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించ వద్దని డీజీపీకి తేల్చి చెప్పారు.