ఆ సెంటిమెంటే నానిని నంబర్ 1 చేస్తోందా..?

admin
Published by Admin — August 10, 2026 in Movies
News Image

టాలీవుడ్‌లో ఏ హీరో కూడా సాహసించని రీతిలో ప్రయోగాలు చేస్తూ, కేవలం తన సహజ నటనతోనే తిరుగులేని మాస్‌ అండ్‌ క్లాస్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు నేచురల్‌ స్టార్‌ నాని(Natural Star Nani). కథల ఎంపికలో ఆయనది ఎంత ప్రత్యేకమైన శైలియో, ఆయా సినిమాల్లో నటించే నాయికల ఎంపికలోనూ ఆయన వ్యూహం అంతకంటే షార్ప్‌గా ఉంటుంది. ఒకప్పుడు కథ డిమాండ్‌ మేరకు జోడీలను ఎంచుకున్న నాని, గడచిన కొన్నేళ్లుగా మాత్రం టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ పల్స్‌ను పూర్తిగా తమ వైపు తిప్పుకునేలా ఒక పక్కా ఫార్ములాను అమలు చేస్తున్నారు. అదే నానిని పరిశ్రమలో మరింత స్పెషల్‌గా నిలబెడుతోంది.

ఇండస్ట్రీలో ఏ హీరోయిన్‌ క్రేజ్ అయితే పీక్స్‌లో ఉంటుందో, ఏ భామ పేరు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో మారుమోగుతుందో.. సరిగ్గా అలాంటి వారినే తన సినిమాల్లో ప్రధాన తారగా లాక్ చేయడం నాని స్టైల్. ఈ వ్యూహం కేవలం యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు, ఇదొక పక్కా మార్కెటింగ్ స్ట్రాటజీ. కీర్తి సురేష్‌ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సమయంలో ` నేను లోకల్`, సాయి పల్లవి(Sai Pallavi) ఫుల్ జోష్‌లో ఉన్నప్పుడు ` ఎంసీఏ`, మృణాల్‌ ఠాకూర్ యూత్ హృదయాలను కొల్లగొట్టిన వేళ ` హాయ్ నాన్న` వంటి చిత్రాలు ఇందుకు నిదర్శనం. ఆ సమయంలో ఆ నటీమణులకు ఉన్న క్రేజ్ ఆటోమేటిక్‌గా నాని సినిమాలపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.

ప్రస్తుతం తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌ విషయంలోనూ నాని ఇదే సెంటిమెంట్‌ను తూచా తప్పకుండా ఫాలో అవుతుండటం విశేషం. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ` పారడైస్` కోసం మోస్ట్ వాంటెడ్ బ్యూటీ కయాదు లోహర్‌ను ఎంపిక చేయడం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. అలాగే సుజిత్ క్రేజీ ప్రాజెక్ట్ ` బ్లడీ రోమియో` కోసం భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) పేరు పరిశీలనలో ఉండటం చూస్తుంటే, నాని వేస్తున్న అడుగులు ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు.

హీరోయిన్ల క్రేజ్‌ను ముందే పసిగట్టి, వారిని తన చిత్రాల్లో భాగం చేసుకోవడం ద్వారా ఓపెనింగ్స్‌ను భారీగా పెంచుకోవచ్చనేది నాని(Nani) లెక్క. ఇలా హీరో ఇమేజ్‌తో పాటు నాయికల క్రేజ్‌ను కూడా మిక్స్ చేస్తూ ఆయన సాగిస్తున్న ప్రయాణం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ ట్రెండింగ్ సెంటిమెంటే నానిని తిరుగులేని విజయాల వైపు నడిపిస్తూ, నంబర్ వన్ రేస్‌లో దూసుకుపోయేలా చేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags
Natural Star Nani Nani Tollywood Heroine Sentiment The Paradise Telugu Cinema Tollywood Updates
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News