తగ్గేదేలే అంటున్న బ‌న్నీ ఫ్యాన్స్‌.. ఏకంగా ల‌క్ష మందికి..!

admin
Published by Admin — August 17, 2026 in Movies
News Image

సినిమా రిలీజైందంటే చాలు.. థియేటర్ల దగ్గర కటౌట్లు, పాలాభిషేకాలు, హడావుడి చేయడం వరకే హీరోల అభిమాన సంఘాల పని అనుకుంటే పొరపాటే. కాలంతో పాటు ట్రెండ్ మారుతోంది.. ఫ్యాన్స్ ఆలోచనా విధానం కూడా పూర్తిగా మారిపోతోంది. కేవలం గ్లామర్ ప్రపంచానికే పరిమితం కాకుండా, సమాజం పట్ల మాకూ బాధ్యత ఉందంటూ ముందుకు వస్తున్నారు. సరిగ్గా ఇదే కోవలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) అభిమాన సంఘం ('ఆఫా' - అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్) ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

సాధారణంగా ఫ్యాన్స్ అంటే తమ హీరో సినిమాల గురించి సోషల్ మీడియాలో ట్రెండ్లు చేయడం, గొడవలు పడడం చూస్తుంటాం. కానీ బన్నీ(Bunny) ఆర్మీ మాత్రం రూటు మార్చింది. ప్రజల ప్రాణాలను హరిస్తున్న ఒక భయంకరమైన సమస్యపై నేరుగా యుద్ధమే ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వస్థ్ నారీ వికసిత్ భారత్' కార్యక్రమంలో భాగంగా వీరు రికార్డు సృష్టించారు.

సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్) అనేది మహిళలను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న ప్రాణాంతక సమస్య. దీనిపై ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, యువతుల్లో కూడా సరైన అవగాహన లేదు. ఈ లోపాన్ని గమనించిన 'ఆఫా(AAFA)' సభ్యులు స్వచ్ఛందంగా రంగంలోకి దిగారు. దేశంలోని ఏడు వేర్వేరు రాష్ట్రాల్లో ఏకంగా 400లకు పైగా ప్రత్యేక అవగాహన సదస్సులను విజయవంతంగా నిర్వహించారు.

కేవలం మీటింగ్‌లతో సరిపెట్టకుండా, సుమారు లక్ష మంది యువతులకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, క్యాన్సర్(Cancer) నివారణ పద్ధతులపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. భవిష్యత్తులో బాలికలు, యువతులు ఆరోగ్యంగా ఉండాలనే గొప్ప లక్ష్యంతో వీరు చేస్తున్న ఈ సాహసోపేతమైన కృషికి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమాల్లో తగ్గేదేలే అనడమే కాదు.. సమాజానికి సేవ చేయడంలోనూ మాదే లీడ్ అని బన్నీ ఫ్యాన్స్ నిరూపించి చూపించారు.

Tags
Allu Arjun AAFA Swasth Nari Viksit Bharat Icon Star Raaka Bunny Tollywood
Recent Comments
Leave a Comment

Related News