రేవంత్ వైపే హై కమాండ్ మొగ్గు!

admin
Published by Admin — September 05, 2026 in Telangana
News Image

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రి ప‌దువులు ఖాళీగా ఉన్నాయి. ప్ర‌స్తుతం మూడు ప‌ద‌వులు ఖాళీగా ఉండ‌గా.. మ‌రో రెండు చేర్చి.. ఐదుగురు మంత్రుల‌ను చేర్చుకునేందుకు అవ‌కాశం ఉంది. అయి తే.. స‌హ‌జంగానే జాతీయ పార్టీ కాంగ్రెస్‌లో ఆది నుంచి కూడా.. ప్ర‌భావం చూపించే నేత‌ల‌కు ప‌గ్గాలు ద‌క్కుతున్నాయి. ఇటీవ‌ల క‌ర్ణాట‌క‌లోనూ ఇదే ఫార్ములా ప‌నిచేసింది. అధిష్టానం ద‌గ్గ‌ర ప‌ర‌ప‌తి ఉన్న నాయ‌కులు మంత్రి పీఠాలు ద‌క్కించుకున్నారు.

కానీ, 2023లో తెలంగాణలో ఎన్నిక‌ల అనంత‌రం.. ఈ త‌ర‌హా విధానానికి దాదాపు 50 శాతం మేర‌కు.. కాంగ్రె స్ పార్టీ చెక్ పెట్టింది. ఇప్పుడు మ‌రో 50 శాతం క‌లిపి.. మొత్తంగా 100 శాతం మేర‌కు ఈ ప‌ర‌ప‌తి రాజ‌కీయా లకు చెక్ పెట్టేదిశ‌గా అడ‌గులు వేస్తోంది. అంటే.. ఇక‌పై అధిష్టానం ద‌గ్గ‌ర ప‌ర‌ప‌తి ఉందనో.. పెద్ద నేత‌ల తో స‌ఖ్య‌త ఉంద‌నో నాయ‌కులు చెబితే ప‌ద‌వులు ద‌క్కే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. పూర్తిగా విధేయ‌త‌కు పెద్ద‌పీట వేయాల‌ని నిర్ణ‌యించారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కృత నిశ్చ‌యంతో ఉంది. ఈ నేప‌థ్యంలో స్థానికంగా బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న సీఎం రేవంత్ వైపే పార్టీ మొగ్గు చూపుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అన్ని నామినేటెడ్ కానీ.. ఇత‌ర ప‌ద‌వుల విష‌యంలో కానీ.. రేవంత్ మాట వైపే అధిష్టానం మొగ్గు చూపింది. సో.. ఇక ముందు కూడా.. భవిష్య‌త్తును దృష్టిలో పెట్టుకుని రేవంత్ ప‌ట్ల విధేయ‌త చూపించేవారికి..అధిష్టానం ప‌ట్ల విధేయులుగా ఉన్న‌వారికి మాత్ర‌మే ప‌ద‌వుల్లో అవ‌కాశం ఇచ్చే ఛాన్స్ క‌నిపిస్తోంది.

ముఖ్యంగా ఈ విష‌యంలో రేవంత్ వైపు అధిష్టానం మొగ్గుతోంది. దీనికి కార‌ణం.. తిరిగి ఎన్నిక‌ల్లో పార్టీని విజ‌య‌తీరాల వైపు న‌డిపించే ఐకాన్ నాయ‌కుడిగా రేవంత్ ఒక్క‌రే క‌నిపిస్తున్నారు. ఈ విష‌యంలో ఎవ‌రికీ భిన్నాభిప్రాయాలు లేవు. సో.. అందుకే రేవంత్ ప‌ట్ల విధేయులుగా ఉ న్న‌వారిని, ఆయ‌న ప‌ట్ల సానుకూలం గా ఉన్న‌వారిని.. ఆయ‌న నాయ‌క‌త్వాన్ని అంగీక‌రించే వారినే.. మంత్రి ప‌ద‌వులు వ‌రించ‌నున్నాయ‌న్న విధంగా ఇప్ప‌టికే సంకేతాలు పంపించింది. మారుతున్న రాజ‌కీయాల‌కు అనుగుణంగా పార్టీ ఈ త‌ర‌హా నిర్న‌యం తీసుకుంద‌ని కూడా తెలుస్తోంది.

Tags
Congress High command trusting CM revanth reddy Backing Cabinet ministers
Recent Comments
Leave a Comment

Related News