కేటీఆర్ మేనేజ్మెంట్ కోటా లీడర్: రేవంత్

admin
Published by Admin — November 22, 2026 in Telangana
News Image
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ ల పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. తన కథలో కేసీఆర్ రావణాసురడు అని విమర్శించారు. కేటీఆర్ మేనేజ్మెంట్ కోటా నాయకుడని ఎద్దేవా చేశారు. తన రాజకీయ ప్రత్యర్థి కేసీఆర్ అని, తండ్రి ఇమేజ్ తో లీడర్ అయిన కేటీఆర్ ఒక మేనేజ్మెంట్ కోటా నాయకుడు మాత్రమేనని విమర్శించారు.
 
బీఆర్ఎస్ నాయకులు పగటి కలలు కంటున్నారని, కాంగ్రెస్ తలుచుకుంటే ఆ పార్టీ ఎప్పుడో ఖతం అయ్యేదని చెప్పారు. ప్రతిపక్షం ఉండాలన్న ఉద్దేశంతోనే బీఆర్ఎస్ ను వదిలిపెడుతున్నామని చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీకి ఏమాత్రం ప్రాధాన్యత లేదని ఆయన అన్నారు. మెస్సి హైదరాబాద్ కు వచ్చారని, అలాగే రొనాల్డోను కూడా తెలంగాణకు ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ జరగబోతుందని, తెలంగాణలో భారీ పెట్టుబడులు రాబోతున్నాయని అన్నారు.
Tags
cm revanth reddy ktr management quota
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News