కుట్ర కేసులో NATA మాజీ అధ్యక్షుడు రాఘవ రెడ్డికి జైలు

admin
Published by Admin — October 11, 2026 in Nri
News Image

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATA) మాజీ అధ్యక్షుడు డాక్టర్ రాఘవ రెడ్డి ఘోసాలకి జైలు శిక్ష విధించిన వైనం సంచలనం రేపుతోంది. పెన్సిల్వేనియాకు చెందిన భారతీయ సంతతి వైద్యుడైన రాఘవ రెడ్డి 2019 నుండి 2022 వరకు NATA అధ్యక్షుడిగా పనిచేశారు. అమెరికాలో జరిగిన ఒక కార్పొరేట్ మోసం కేసులో ఆయన నేరాన్ని అంగీకరించారు. వైర్ ఫ్రాడ్ కుట్ర, యునైటెడ్ స్టేట్స్‌ను మోసం చేసే కుట్రకు సంబంధించి నేరాన్ని ఆయన ఫెడరల్ కోర్టులో అంగీకరించారు.

2019-22 మధ్యకాలంలో అనేక కార్పొరేట్ మ్యాచింగ్ ప్రోగ్రామ్‌లను మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగులు చారిటబుల్ విరాళాల కోసం కార్పొరేట్ మ్యాచింగ్ చెల్లింపులను అభ్యర్థించి పొందేలా చేసి, మిలియన్ల డాలర్ల విలువైన చెల్లింపులను సాధించిందని ఆరోపణలు వచ్చాయి. ఆ విరాళాలు మ్యాచింగ్ చెల్లింపులకు అర్హత లేనివి. NATA ఉద్యోగులకు (నేరుగా కాకుండా నగదు లేదా మధ్యవర్తుల ద్వారా) వాటిని తిరిగి చెల్లించేది. ఇతరులతో కలిసి అప్పటి నాటా అధ్యక్షుడు రాఘవ రెడ్డి 2019 నుంచి 2021 వరకు NATA పన్ను రిటర్న్‌లను తప్పుగా చూపారు. దాతలకు రీయింబర్స్‌మెంట్‌గా ఉపయోగించిన ఖర్చులను చట్టబద్ధమైన ఖర్చులుగా మార్చారు. ఆ రిటర్న్‌లు తప్పు అని తెలిసి కూడా వాటిని ఫైల్ చేయడానికి ఆయన అనుమతిచ్చారు. ఈ విషయాన్ని ఆయన ఫెడరల్ కోర్టులో అంగీకరించారు.

రాఘవ రెడ్డి సెంటెన్సింగ్ విచారణ 2027 ఫిబ్రవరి 22న మధ్యాహ్నం 1:30 గంటలకు యు.ఎస్. డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎడ్వర్డ్ జె. డావిలా ముందు నిర్ణయించారని యునైటెడ్ స్టేట్స్ అటార్నీ క్రెయిగ్ హెచ్. మిస్సాకియన్, IRS క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ (IRS-CI) సాన్ ఫ్రాన్సిస్కో ఫీల్డ్ ఆఫీస్ యాక్టింగ్ స్పెషల్ ఏజెంట్ ఇన్ ఛార్జ్ డేవిడ్ లోవ్, మరియు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) స్పెషల్ ఏజెంట్ ఇన్ ఛార్జ్ స్కాట్ షెల్బే తెలిపారు. వైర్ ఫ్రాడ్ కుట్రకు గరిష్టంగా 20 సంవత్సరాలు జైలు శిక్ష, యునైటెడ్ స్టేట్స్‌ను మోసం చేసే కుట్రకు 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించవచ్చని అన్నారు.

మరోవైపు, తానాపై అమెరికా అధికారులు సైలెంట్ గా విచారణ జరుపుతున్నారు. త్వరలోనే మరో బ్రేకింగ్ న్యూస్ వెలువడే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

Tags
NATA Ex President raghava reddy ghosala fraud case plead guilty
Recent Comments
Leave a Comment

Related News

Latest News