పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘స్పిరిట్(Spirit)’ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘యానిమల్’ వంటి సంచలన విజయాల తర్వాత సందీప్ వంగా ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. కెరీర్లో మొదటిసారి ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతుండటం ఈ ప్రాజెక్ట్‌పై మరింత హైప్ పెంచేసింది.
అయితే ఈ సినిమా విడుదల విషయంలో మేకర్స్ నుంచి వస్తున్న అప్డేట్స్ అభిమానులను కాస్త నిరుత్సాహానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ తాజాగా మరోసారి ఆలస్యం కానుందనే వార్త ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. సినిమా మేకింగ్‌లో ఎక్కడా రాజీ పడకుండా, అత్యున్నత సాంకేతిక విలువలతో విజువల్స్ పర్ఫెక్ట్గా వచ్చేలా సందీప్ వంగా(Sandeep Reddy Vanga) ప్రతి సన్నివేశాన్ని అత్యంత శ్రద్ధగా మలుస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా విడుదల చేసిన కొత్త రిలీజ్ డేట్ ప్రకారం.. ఈ చిత్రాన్ని 2027 దీపావళి కానుకగా అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. నిజానికి 2027 సమ్మర్ లో మూవీ రిలీజ్ కావాల్సి ఉన్నా.. అనుకున్న దానికంటే షెడ్యూల్స్ మారడం, షూటింగ్ పార్ట్ మరింత టైమ్ తీసుకోవడంతో సినిమా ఆలస్యం తప్పట్లేదని తెలుస్తోంది. ఏదేమైనా ప్రభాస్(Prabhas) కెరీర్లోనే ఇదొక ల్యాండ్‌మార్క్ మూవీగా నిలుస్తుందని, బాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డులను తిరగరాస్తుందని ఫ్యాన్స్ పూర్తి ధీమాతో ఉన్నారు.