స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగే అవకాశం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం ఏది? అం టే.. ఠక్కున చెబుతున్న నియోజకవర్గం పులివెందుల. అనుకున్నట్టుగా స్థానిక సంస్థల పోలింగ్ ప్రారంభం కాక ముందే ఇక్కడ రాజకీయ ఉద్రిక్తతలు రాజుకున్నాయి. శనివారం అర్ధరాత్రి నుంచి టీడీపీ, వైసీపీ అభ్యర్థుల అనుచ రుల మధ్య కవ్వింపులు, దాడులు ప్రారంభమయ్యాయి. ఓ పార్టీకి సానుభూతి పరుడుగా ఉన్న వ్యక్తి ఫామ్‌హౌస్‌లో నిలిపి ఉంచిన 15 వాహనాలకు దుండగులు నిప్పంటించారు.
ఇక, పులివెందులలో పోలింగ్ ప్రారంభం కూడా అతి కష్టంగా మొదలైంది. టీడీపీ శ్రేణులను వైసీపీ నేతలు అడ్డుకు న్నారని.. కాదు, తమనే టీడీపీ వారు అడ్డుకున్నారని వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. పులివెందులలోని పలు వార్డుల్లో వైసీపీ అభ్యర్థులను బూత్‌ల వద్దకు రాకుండా పోలీసులే నిలువరించారని వార్తలు వచ్చాయి. మరికొన్ని చోట్ల ఏజెంట్లను కూడా బూతుల వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఉద్రిక్తతలను అదుపు చేసేందుకు ఇలా చేయాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నా.. ఏజెంట్లు లేకుండా పోలింగ్ ఎలా అనేది చర్చకు దారితీసింది.
ఇక, పులివెందుల మున్సిపల్ చైర్ పర్సన్ వైసీపీ అభ్యర్థి ప్రమీలను కొందరు టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీం తో ఆమె రోడ్డుపైనే భైఠాయించడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. కొన్ని వార్డుల్లో ఎంపీ అవినాష్ రెడ్డి పర్య టించేందుకు బయలు దేరగా.. పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఆయనను అడ్డుకున్నారు. పులివెందులలో ని 11, 12 వార్డుల్లో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట, రాళ్ల దాడి చోటు చేసుకుంది. ఇరు పక్షాలపైనా పోలీసులు లాఠీ చార్జి చేయగా.. వైసీపీ అభ్యర్థి కూడా గాయపడ్డారు.
ఎటు చూసినా..
పులివెందులలో ఎటు చూసినా.. తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మెజారిటీ ఓటర్లు గడప దాటేందుకు కూడా భయపడే పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు రక్షణగా నిలిచినా.. ఎక్కడ ఏం జరుగుతుందో అన్న భయంతో పోలింగ్ బూతుల వద్ద ఉన్నవారు కూడా వెనక్కి వెళ్లిపోయారు. కొన్ని చోట్ల తమ ఓటు గల్లంతైందని ఓటర్లు కేకలు పెట్టారు. మరికొన్ని చోట్ల స్లిప్పులు లాక్కున్నారని.. తమ వోటును వారే వేసుకున్నారని ఓ పార్టీకి చెందిన నాయకులపై ప్రజలు ఆరోపించారు. మొత్తంగా పులివెందులలో ఇరు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.