ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. మ‌ళ్లీ కెమెరా ముందుకు CM విజ‌య్‌..!

admin
Published by Admin — November 07, 2026 in Movies
News Image

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకానికి నాంది పలికిన దళపతి విజయ్(Thalapathy Vijay), ఇప్పుడు మరో ఆసక్తికరమైన పరిణామంతో చర్చనీయాంశంగా మారారు. కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకుని, వెండితెరకు పూర్తిగా వీడ్కోలు పలికి పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టిన ఆయన.. అనూహ్యంగా మళ్లీ కెమెరా ముందుకు రాబోతున్నారనే వార్త ఇప్పుడు తమిళనాట పెను సంచలనమే రేపుతోంది. సినిమాలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పేశార అనుకున్న తరుణంలో, ఆయన రూట్‌ మార్చి మళ్లీ షూటింగ్ సెట్స్‌లో అడుగుపెడుతుండటం రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని కలిగిస్తోంది.

అయితే, ఈ రీఎంట్రీ వెనుక ఉన్న అసలు కారణం మరేదో సినిమా కోసం కాదట. రాష్ట్ర ప్రభుత్వం(TVK Govt) తరఫున ప్రజల్లోకి వెళ్లే ప్రతిష్టాత్మక పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను అత్యంత ప్రభావవంతంగా జనాలకు చేరవేయడం కోసం తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ ప్రచార ప్రకటనను సిద్ధం చేస్తోంది. ఈ స్పెషల్ యాడ్ కోసమే విజయ్ స్వయంగా రెండు రోజుల పాటు కాల్షీట్లు కేటాయించినట్లు సమాచారం. ప్రభుత్వ పరంగా రూపొందించే సాధారణ ప్రకటనలంటే కేవలం తక్కువ బడ్జెట్, పరిమిత సమయంతో మమ అనిపించేస్తుంటాయి. కానీ, విజయ్ లాంటి మాస్ లీడర్ తెరపై కనిపించబోతుండటంతో ఈ ప్రాజెక్ట్‌ను మాత్రం కేవలం ఒక యాడ్‌లా కాకుండా సినిమా స్థాయి విజువల్స్, నూతన టెక్నాలజీతో అత్యున్నత ప్రమావిధాలతో తెరకెక్కించాలని సర్కార్ భావిస్తోందట.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్ ఏంటంటే.. ఈ ప్రచార చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్(Gautham Menon) దర్శకత్వం వహిస్తున్నారట. విజయ్ ఇమేజ్‌కు తగినట్లుగా, పబ్లిక్‌లో ఈ యాడ్ భారీ ఇంపాక్ట్ చూపేలా గౌతమ్ మీనన్ తనదైన స్టైలిష్ టేకింగ్‌తో దీన్ని మలచబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ప్రభుత్వ ప్రకటనలకు ఉండే బడ్జెట్ లెక్కలను పక్కన పెట్టి, ఒక కమర్షియల్ సినిమా రేంజ్‌లో దీనికి భారీగా ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి, పాలిటిక్స్‌లో బిజీగా ఉంటూనే మరోసారి కెమెరా ముందుకొస్తున్న విజయ్.. ఈసారి డైరెక్టర్ గౌతమ్ మీనన్‌తో కలిసి ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తారో చూడాలని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభంకానుండటంతో తమిళ రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.

Tags
Thalapathy Vijay CM Vijay Gautham Menon Vijay Movies Kollywood TamilNadu Politics TVK
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News