క‌మ‌ల వికాసం.. నాడు - నేడు.. !

admin
Published by Admin — November 07, 2026 in Politics, Andhra
News Image

రాష్ట్రంలో బీజేపీ విస్త‌రిస్తోందా? .. ఆ పార్టీకి ఎన‌లేని వైభ‌వం దిశ‌గా అడుగులు వేస్తోందా? అంటే.. ఔన‌నే స‌మాధానమే వినిపిస్తోంది. కూట‌మిగా టీడీపీ(TDP), జ‌న‌సేన‌తో చేతులు క‌లిపిన త‌ర్వాత‌.. 2024 ఎన్నిక‌ల నుంచి కూడా బీజేపీకి గ‌తంలో లేని వైభ‌వం ఇప్పుడు సొంతం  కావ‌డం గ‌మ‌నార్హం. ఇదే విష‌యంపై క‌మ‌ల నాథులు కూడా ఖుషీ అవుతున్నారు. వాస్త‌వానికి 2014లోనూ బీజేపీ.. టీడీపీతో చేతులు క‌లిపింది. అధికారంలోకి కూడా వ‌చ్చి.. మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకుంది.

ఆ త‌ర్వాత‌.. 2019లో విడిపోయి.. ఒంట‌రి పోరు సాగించింది. దీంతో క‌మ‌ల వికాసం కుంచించుకుపోయింది. ఇక‌, 2024లో మ‌రోసారి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, చంద్ర‌బాబుల(Chadhrababu) సార‌థ్యంలోని కూట‌మితో చేతులు క‌లిపిన త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ అనూహ్య‌మైన ఫ‌లితాల‌నే ద‌క్కించుకుంద‌ని చెప్పారు. ఏకంగా 8 మంది ఎమ్మెల్యేల‌ను గెలిపించుకోగా.. మూడు ఎంపీ స్థానాల్లో(న‌ర‌సాపురం, రాజ‌మండ్రి, అన‌కాప‌ల్లి) కూడా బీజేపీ విజ‌యం ద‌క్కించుకుంది. కేంద్రంలోనూ మంత్రి ప‌ద‌విని పొందింది.

ఇక‌, ఇప్పుడు మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో దాదాపు పోటీ చేసిన చోట‌ల్లా బీజేపీ విజ‌యం ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం. ఒక్క అనంత‌పురం మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌(Municipal Coorporation), ధ‌ర్మ‌వ‌రంలో ఒక చోట ఒక ఓటుతోనూ.. పార్టీ వార్డును కోల్పోయినా.. ఇత‌ర స్థానిక ఎన్నిక‌ల్లో మాత్రం కూట‌మి ప‌క్షాల త‌ర‌ఫున విజ‌యం కైవ‌సం చేసుకుంది. ఇది బీజేపీ హిస్ట‌రీలోనే ఫ‌స్ట్ టైమ్ అని విశ్లేష‌కులు చెబుతున్నారు. వ్య‌క్తిగ‌తంగా బ‌లం ఉందా?  లేదా? అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. గ‌తంలో ప‌శ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లోనూ అధికార పార్టీతో  జ‌త‌క‌ట్టి.. అక్క‌డ కూడా ఇలానే విజ‌యం ద‌క్కించుకున్నారు.

ఆ త‌ర్వాత‌.. ఏకంగా అధికారంలోకి వ‌చ్చిన ప‌రిస్థితి అక్క‌డ ఉంది. ఇక్క‌డ ఒంట‌రిగా అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ప‌క్క‌న పెడితే.. కేవ‌లం 1.8-2 శాతం మ‌ధ్య మాత్ర‌మే ఉన్న ఓటు బ్యాంకును ఇప్పుడు పుంజుకునేలా చేసి.. కూట‌మి ప‌క్షాల త‌ర‌ఫున అధికారంలోకి రావ‌డంతోపాటు.. స్థానికంగా కూడా వార్డుల‌ను, మునిసిపాలిటీల‌ను కైవ‌సం చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. అస‌లు ఏమీ లేని చోట మార్కాపురం వంటి చోట్ల కూడా మునిసిపాలిటీని బీజేపీ సొంతం చేసుకుంది. సో.. మొత్తంగా చూస్తే.. కేవ‌లం 10 ఏళ్ల‌లో బీజేపీ(BJP) ఈ స్థాయిలో పుంజుకోవ‌డం.. ఆశ్చ‌ర్య‌మే అయినా.. కూట‌మి ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపించింద‌ని అంటున్నారు.

Tags
BJP Andhra Pradesh NDA AP Politics AP Municipal Elections AP BJP BJP Vote Share
Recent Comments
Leave a Comment

Related News