విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)-రష్మిక మందన్నా.. వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ఈ క్రేజీ జోడీ అంటే అభిమానులకు ఎంతో ఇష్టం. ఎన్నాళ్లగానో సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ, ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్ వేదికగా ఈ జంట ఒక్కటైన సంగతి తెలిసిందే. అత్యంత సన్నిహితుల మధ్య వైభవంగా వివాహం చేసుకున్న ఈ నూతన దంపతులు, పెళ్లి తర్వాత కూడా వరుస ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా రష్మిక పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది.
సాధారణంగా పెళ్లయిన వెంటనే జంటలు హనీమూన్‌కు వెళ్తుంటారు, కానీ ఈ జంట మాత్రం తమ క్లోజ్ ఫ్రెండ్స్‌తో కలిసి ‘బడ్డీమూన్’ ప్లాన్ చేసి వెరైటీగా ఆలోచించారు. ఈ విహారయాత్ర ముగిసిన కొద్దిరోజులకే రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక యానిమేషన్ క్లిప్‌ను షేర్ చేసింది. ఇందులో విజయ్, రష్మికలతో పాటు ఒక చిన్న పొద్దుతిరుగుడు పువ్వు కనిపిస్తోంది. దీనికి తోడు రష్మిక ధరించిన టీ-షర్ట్‌పై గుడ్డు గుర్తు ఉండటంతో నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. `` మేము ఇప్పుడు ముగ్గురమయ్యాం`` అనే క్యాప్షన్ ఇవ్వడంతో, రష్మిక(Rashmika) తల్లి కాబోతోందని, పెళ్లైన నెలకే గుడ్ న్యూస్ చెప్పిందని ఫ్యాన్స్ కంగ్రాచ్యులేషన్స్ చెప్పడం మొదలుపెట్టారు.
అయితే ఈ పోస్ట్ వెనుక ఉన్న అసలు రహస్యం వేరే ఉంది. రష్మికకు తన పర్సనల్ ప్రపంచంలో ఒక క్యూట్ అలవాటు ఉంది. ఆమె ఒక పొద్దుతిరుగుడు పువ్వును తన బెస్ట్ ఫ్రెండ్‌గా భావిస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా 'Rashmikaru' అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీని కూడా నిర్వహిస్తోంది. అందులో యానిమేటెడ్ రూపంలో తన ఫీలింగ్స్‌ని షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు పెళ్లి తర్వాత, తన సొంత యానిమేషన్ ప్రపంచంలోకి భర్త విజయ్ దేవరకొండను కూడా రష్మిక ఆహ్వానించింది. ఆ వీడియోలో ఉన్న మూడో వ్యక్తి మరెవరో కాదు, ఆ పొద్దుతిరుగుడు పువ్వే!
తాము ముగ్గురం అంటే.. విజయ్(Vijay), రష్మిక మరియు వారి ప్రియమైన పొద్దుతిరుగుడు పువ్వు అని అర్థం. టీ-షర్ట్‌పై ఉన్న ఎగ్ పిక్చర్ కేవలం ఒక డిజైన్ మాత్రమేనని, అది ప్రెగ్నెన్సీకి సంకేతం కాదని స్పష్టమవుతోంది. ఏది ఏమైనా తన క్రియేటివ్ ఆలోచనలతో ఫ్యాన్స్‌ను ఒక్కసారిగా కన్ఫ్యూజ్ చేసిన రష్మిక, మొత్తానికి తన యానిమేషన్ ఫ్యామిలీ ఇలా రివీల్ చేసింది. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.