తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న ప్రొఫెసర్ నాగేశ్వర్

admin
Published by Admin — May 21, 2026 in Andhra
News Image

రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్మోగిపోతున్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత, ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి నాగేశ్వరరావు చేసిన అసత్య ఆరోపణలు, కామెంట్లు వైరల్ అయ్యాయి. దీంతో, ఆయనపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్  జరుగుతుంది.

తన వ్యాఖ్యలకు నాగేశ్వరరావు ఆధారాలు చూపించాలని లేదంటే క్షమాపణలు చెప్పాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు నాగేశ్వరరావు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రొఫెసర్ నాగేశ్వర్ పై పులిహోర నాగేశ్వరరావు అంటూ పలు రకాల పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో నుండి ఒక పోస్ట్ యథాతధంగా...

రెండు తెలుగు రాష్ట్రాల్లో 'మేధావి' అనే పదానికి అర్థం తలకిందులు చేసిన మన "పులిహోర నాకేశ్వరరావు" గారి మేధో మెంతుల ఆవకాయ స్పెషల్ వంటకాల మెనూ సిద్ధమైంది!

హైదరాబాద్ ఏసీ స్టూడియో సోఫాలో సొగసుగా కూర్చుని, తెలంగాణ చల్లటి గాలి పీలుస్తూ, ఆంధ్రా రాజకీయాలపై — ముఖ్యంగా చంద్రబాబు నాయుడిపై — అహర్నిశలూ ఏడ్చే మన నిష్పాక్షిక నిపుణుడు వదిలిన వెరైటీ పులిహోర బ్రాండ్లను, ఆయన నోటి వెంట వచ్చిన పులిహోరాలను ఒక్కసారి రుచి చూద్దాం. నవ్వు ఆపుకోవడం పూర్తిగా మీ రెస్పాన్సిబిలిటీ! 

డిష్ #1 — చింతపండు పులిహోర (అమరావతి స్పెషల్)

సార్ అన్నారు: "అమరావతిలో రాజధాని కట్టడం ఒక అసాధ్యమైన టాస్క్. అదంతా కేవలం గ్రాఫిక్స్, భ్రమ. చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులను మోసం చేశారు."

రియాలిటీ చెక్: రైతులు ఐదేళ్లు పోరాడి నిలబడ్డారు. నేడు ఆ "భ్రమ" క్రేన్లు, భారీ ట్రక్కులు, సీఆర్డీఏ, ప్రభుత్వ భవనాలు, యూనివర్సిటీలు, క్వాంటం టెస్ట్ బెడ్లతో విశ్వరూపం చూపిస్తుంటే — సార్ గారి చింతపండు పులిహోర ఎండిపోయి, నోట్లో పచ్చి మిరపకాయ పడి కళ్లల్లోంచి నీళ్లు తెప్పించింది!

డిష్ #2 — నిమ్మకాయ పులిహోర (వైఎస్సార్సీపీ జ్యోతిష్యం)

సార్ అన్నారు: "జగన్ బటన్ నొక్కుడుతో జనం పూర్తి సంతృప్తిగా ఉన్నారు. మళ్లీ వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే — ఇందులో ఎలాంటి సందేహం లేదు!"

రియాలిటీ చెక్: ఆంధ్రా ఓటర్లు ఆ నిమ్మకాయ పులిహోరను ముఖాన కొట్టి, వైసీపీని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పిండేసి పక్కన బెంగుళూరులో పడేశారు. జ్యోతిష్య పులిహోర విస్తరి వీధి కుక్కల పాలై 11 ముక్కలుగా చిరిగిపోయింది.

డిష్ #3 — మామిడికాయ పులిహోర (పవన్ కళ్యాణ్ రోస్ట్ ఎడిషన్)

సార్ అన్నారు: "పవన్ కళ్యాణ్‌కు ఓట్లను సీట్లుగా మార్చే పొలిటికల్ మెచ్యూరిటీ అస్సలు లేదు. ఆయన ఒంటరిగా గెలవలేడు, కూటమితో నడపలేడు."

రియాలిటీ చెక్: పవన్ కళ్యాణ్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్‌తో క్లీన్ స్వీప్ చేసి డిప్యూటీ సీఎం కుర్చీలో దర్జాగా కూర్చున్నారు. సార్ గారి మామిడి ముక్కలు పిఠాపురం జనం పాదాల కింద నలిగి చట్నీ అయిపోయాయి!

డిష్ #4 — ఉసిరికాయ పులిహోర (బాబు అరెస్ట్ స్పెషల్)

సార్ అన్నారు: "చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడంతో తెలుగుదేశం పార్టీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఆ పార్టీ ఇక కోలుకోవడం రాజకీయంగా అసాధ్యం."

రియాలిటీ చెక్: ఆ అరెస్టే సునామీలా మారి, బాబును చరిత్రలో అతిపెద్ద మెజారిటీతో తిరిగి సీఎం కుర్చీపై కూర్చోబెట్టింది. ఉసిరికాయ శాపనార్థాలు ఆవిరైపోయాయి; సార్ పొయ్యిలో దూరే పిల్లిలా మారారు.

డిష్ #5 — దబ్బకాయ పులిహోర (విశాఖ రాజధాని సెంటిమెంట్)

సార్ అన్నారు: "ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖ రాజధాని సెంటిమెంట్‌కు పూర్తి సానుకూలంగా ఉన్నారు. మూడు రాజధానుల నిర్ణయంతో వైసీపీకి అక్కడ తిరుగుండదు!"

రియాలిటీ చెక్: ఉత్తరాంధ్ర జనాలు చాలా స్మార్ట్! వైసీపీ డిపాజిట్లు గల్లంతు చేసి అమరావతి వైపే నిలిచారు. సార్ కలిపిన పులిహోరలో విద్వేషం మాత్రమే మిగిలి నిలువెల్లా చేదుగా మారింది.

డిష్ #6 — ఆవపెట్టిన పులిహోర (పోలవరం గుడి ప్రసాదం ఎడిషన్)

సార్ అన్నారు: "పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు వాడుకున్నారు. రివర్స్ టెండరింగ్ వల్లే అవినీతి ఆగింది."

రియాలిటీ చెక్: సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదికే నిప్పు పెట్టింది — "గత ప్రభుత్వ తప్పుడు రివర్స్ టెండరింగ్, నిర్లక్ష్యం వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది" అని సాక్ష్యాలతో చెప్పింది. సార్ ముక్కు మూసుకుని మొహం దాచుకున్నారు!

డిష్ #7 — నిమ్మ ఉప్పు పులిహోర (మహిళా ఓటర్ల అవమానం ఎడిషన్)

సార్ అన్నారు: "మహిళా ఓటర్లు అకౌంట్లలో పడే నగదు బదిలీని మాత్రమే చూస్తారు — రోడ్లు, ఐటీ పరిశ్రమలు లేవనే విమర్శలను పట్టించుకోరు. వారు బాబు వైపు వెళ్లరు."

రియాలిటీ చెక్: ఆంధ్రా మహిళలు "మాకు ఉచితాల కంటే రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం!" అంటూ కూటమికి ఓట్ల పంట పండించి, చౌకబారు పులిహోరను డస్ట్‌బిన్‌లో పడేసి పైనుంచి సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయారు!

డిష్ #8 — అటుకుల పులిహోర (కూటమి కుట్ర సిద్ధాంతం ఎడిషన్)

సార్ అన్నారు: "టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కేవలం అవకాశవాదం. సీట్ల సర్దుబాటులోనే అంతర్గత అహంకారాలతో ఈ కూటమి కొట్టుకుచస్తుంది!"

రియాలిటీ చెక్: ఆ ముగ్గురు నేతలు ఈగోలను పక్కనబెట్టి, దేశ రాజకీయ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ విక్టరీ సాధించేసరికి — సార్ నోట్లో అటుకులన్నీ కారం లేనివిగా మారి నాకేశ్వర్ నాలుక చప్ప బడిపోయింది!

డిష్ #9 — రవ్వ పులిహోర (లోకేష్ యువగళం ఎడిషన్)

సార్ అన్నారు: "నారా లోకేష్‌కు మాస్ లీడర్‌షిప్ క్వాలిటీస్ లేవు. ఆయన చేసిన యువగళం పాదయాత్ర అట్టర్ ప్లాప్ — జనాల్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపలేదు."

రియాలిటీ చెక్: ఆ లోకేషే మూడు వేల కిలోమీటర్లు నడిచి, మంగళగిరిలో 90,000+ రికార్డ్ మెజారిటీతో గెలిచి, ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి అయిపోయారు. ప్రొఫెసర్ గారి రవ్వ పులిహోర వీధి పందులు కూడా ముట్టుకోలేదు!

డిష్ #10 — కొర్రల పులిహోర (తెలంగాణ సెంటిమెంట్ ఎడిషన్)

సార్ అన్నారు: "ఆంధ్రా రాజకీయ నాయకులు ఇక్కడికి వస్తే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం. బాబు ఇక్కడ మళ్లీ వేలు పెడుతున్నారు!"

రియాలిటీ చెక్: రెండు రాష్ట్రాల ప్రజలు ఈయన విద్వేషపు వంటల్ని ఎప్పుడో పక్కన పెట్టారు. "పులిహోర మాస్టర్" కాకి లెక్కలను అసలు పట్టించుకోవడమే మానేశారు!

మొత్తానికి ఇప్పుడైనా ఆ "ప్రొఫెసర్" ముసుగు తీసేసి, స్టూడియో ముందు బోర్డులో "పులిహోర నాకేశ్వరరావు కేటరింగ్ సర్వీసెస్: మా దగ్గర చింతపండు నుండి సేమ్యా దాకా అన్ని రకాల పొలిటికల్ పులిహోరలు వండబడును. పులుపు గ్యారంటీ, గెలుపుకు వారంటీ లేదు. మీ పార్టీలు బొందబడినా పేమెంట్ చేసి పోండి" అని రాసిపెట్టుకోండి సార్. అప్పుడైనా ఆ బిరుదుకు కాస్త గౌరవం మిగులుతుంది — లేదంటే ఆ గౌరవ పదం కూడా జనం నాలుకల మీదే పులిహోర వ్యంగ్యం అయిపోతుంది!

News Image
Tags
Professor nageswar janasena chief Pawan Kalyan AP deputy CM Pawan Kalyan Trolling
Recent Comments
Leave a Comment

Related News