అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘లెనిన్(Lenin)’ చిత్రం జులై 10న థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో, ఈ ప్రాజెక్ట్ చుట్టూ జరిగిన ఓ ఆసక్తికరమైన మార్పు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మొదట ఈ సినిమాలో స్టార్ బ్యూటీ శ్రీలీలను హీరోయిన్‌గా అనుకున్నప్పటికీ, అనూహ్యంగా ఆమె స్థానంలోకి ‘మిస్టర్ బచ్చన్’ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే వచ్చి చేరింది. అసలు ఈ మార్పు వెనుక ఉన్న క్రియేటివ్ అండ్ ప్రాక్టికల్ రీజన్స్‌ను నిర్మాత నాగవంశీ తాజాగా బయటపెట్టారు.
నిజానికి ఈ ప్రాజెక్ట్ ప్రారంభంలోనే శ్రీలీల(Sreeleela)ను హీరోయిన్‌గా అనౌన్స్ చేశారు. అయితే, కథకు సంబంధించిన కొన్ని కీలకమైన మార్పులు, క్రియేటివ్ చర్చల కారణంగా సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి ప్రారంభం కాలేదు. మేకర్స్ వైపు నుండి జరిగిన ఈ ఆలస్యం వల్ల, శ్రీలీల ముందుగా కేటాయించిన డేట్స్ వృథా అయ్యాయి. ఆ తర్వాత ఆమె కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్ ప్రాజెక్ట్, అలాగే తెలుగులో పరాశక్తి వంటి భారీ చిత్రాలకు కమిట్ అయి బిజీ అయిపోయింది. కట్ చేస్తే, ‘లెనిన్’ టీమ్ షూటింగ్‌కు రెడీ అయ్యేసరికి శ్రీలీల కాల్‌షీట్స్ ఖాళీ లేవు. డేట్స్ క్లాష్ అవ్వడంతో, ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇరు వర్గాలు సామరస్యంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి.
శ్రీలీల తప్పుకోవడంతో ఈ పాత్ర భాగ్యశ్రీ బోర్సే చెంతకు చేరింది. హీరోయిన్ మారడంతో అప్పటికే షూట్ చేసిన కొన్ని సీన్స్‌ను మళ్లీ రీషూట్ చేయాల్సి వచ్చినప్పటికీ, ఫైనల్ అవుట్‌పుట్ చూశాక చిత్ర యూనిట్ అంతా షాక్ అయ్యారట. ఈ క్యారెక్టర్‌కు భాగ్యశ్రీ వంత శాతం న్యాయం చేసిందని, అసలు ఈ పాత్ర కోసమే ఆమె పుట్టిందా అన్నట్లు నటించిందని నిర్మాత నాగవంశీ ప్రశంసలు కురిపించారు. కాగా, టాలీవుడ్‌లో గ్లామర్ పరంగా మంచి క్రేజ్ ఉన్నప్పటికీ, భాగ్యశ్రీ బోర్సేకి ఇప్పటివరకు గట్టి కమర్షియల్ బ్రేక్ రాలేదు. అటు అఖిల్(Akhil)కు కూడా ఈ సినిమా విజయం అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో 'లెనిన్' పై పాజిటివ్ బజ్ వినిపిస్తుండటంతో, ఈ చిత్రంతో అఖిల్, భాగ్యశ్రీ ఇద్దరూ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకోవడం ఖాయమని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.