ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి ఖాయమని గ్రహించిన వైసీపీ అధినేత జగన్ ఎన్నికల్లో అల్లర్లు సృష్టించేందుకు వ్యూహ రచన చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలకు తగ్గట్లుగానే వైసీపీ నేతలను, కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా జగన్ మాట్లాడుతున్నారు. ‘‘తిరగబడండి...మీ అన్న మీకు తోడుగా ఉన్నాడు...స్లీవ్ మడిచే ఉంది..ఎంతమంది వస్తారో రండి....’’ అంటూ ఊర మాస్ డైలాగులతో జగన్ సినిమా డైలాగులు చెబుతూ కూటమి పార్టీల అభ్యర్థుల మీదకు వైసీపీ కార్యకర్తలను జగన్ ఉసిగొల్పుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ కు ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు.
ఆ కుర్చీని మడత బెట్టి...రేంజ్ లో జగన్ స్లీవ్ మడతబెట్టానని చెబుతున్నారని బుచ్చి రాం ప్రసాద్ ఎద్దేవా చేశారు. జగన్ కుర్చీని జనం ఆల్రెడీ మడతెట్టేశారని, అందుకే 2024లో 11 సీట్లు వచ్చాయని జగన్ కు చురకలంటించారు. ఇప్పుడు జగన్ స్లీవ్ మడతబెడితే 2029 ఎన్నికల్లో కనీసం 11 సీట్లు కూడా రావని సెటైర్లు వేశారు. ఒకవేళ వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాదిరిగా జగన్ స్లీవ్ మడతేస్తా... దుస్తులు విప్పుతా అని డైలాగులు కొట్టి మాధవ్ చూపినట్లు ఏమైనా చూపిస్తారా ఏంటి? అని ఎద్దేవా చేశారు.
2024లో ఆల్రెడీ జగన్ చొక్కా స్లీవ్ మడతబెడితేనే జనం ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా మడతబెట్టారని, అయినా సరే జగన్ కు బుద్ధి రాలేదని విమర్శించారు. ఇంకా ఎన్నిసార్లు జగన్ స్లీవ్, చొక్కా మడతబెడతారు అని ప్రశ్నించారు. ఇకనైన ఈ తరహా బెదిరింపు రాజకీయాలు, ఫ్యాక్షన్ పాలిటిక్స్, రెచ్చగొట్టే మాటలు మానుకోవాలని జగన్ కు హితవు పలికారు. లేదంటే 2024 కన్నా ఘోరమైన ఫలితాలు జగన్ కు 2029లో రిపీట్ అవుతాయని జోస్యం చెప్పారు.