సినీ పరిశ్రమలో మరో ప్రేమకథ సుఖాంతమైంది. తన నటనతో కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి, రీసెంట్‌గా 'ఇరుముడి' చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న బ్యూటీ ప్రియా భవానీ శంకర్(Priya Bhavani Shankar) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. చాలా కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ, ఎట్టకేలకు ఆమె తన చిరకాల ప్రియుడిని పెళ్లాడి కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
ఈ వివాహ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి మరెవరో కాదు, ప్రియా భవానీ శంకర్ ప్రియుడు రాజ్వేల్ రాజ్(Rajvel Raj). సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉండే రాజ్వేల్‌తో ప్రియా ప్రేమ ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగింది. వీరు ఇద్దరూ కాలేజీ రోజుల్లోనే ఒకరినొకరు ఇష్టపడ్డారట. దాదాపు పదేళ్లకు పైగా ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా తమ బంధాన్ని చాలా పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లారు. కాలేజీ స్నేహితులుగా మొదలైన వీరి పరిచయం కాలక్రమేణా గాఢమైన ప్రేమగా మారింది. అంతేకాదు, వివాహానికి చాలా కాలం ముందే అంటే 2022లోనే వీరిద్దరూ కలిసి ఓ సరికొత్త ఇంటిని కూడా కొనుగోలు చేసి తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకున్నారు.
ఇక హడావుడికి దూరంగా, అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో బుధవారం వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. మెడలో రాజ్వేల్ తాళి కడుతున్న సమయంలో ప్రియా భవానీ శంకర్(Priya Bhavani Shankar) ముఖంలో ఆనందం వెల్లువెత్తింది. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నెటిజన్లు, సినీ ప్రముఖులు ఈ కొత్త జంటకు సోషల్ మీడియా వేదికగా అభినందనల వర్షం కురిపిస్తున్నారు.
కాగా, న్యూస్ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత బుల్లితెర సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న ప్రియా భవానీ శంకర్.. ఆపై వెండితెరకు పరిచయమయ్యారు. 'మేయాద మాన్' చిత్రంతో నటిగా మారిన ఆమె, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. కోలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించడమే కాకుండా, టాలీవుడ్‌లోనూ ‘కళ్యాణం కమనీయం’, ‘భీమా’ చిత్రాలు, ‘దూత’ వెబ్ సిరీస్‌తో మన తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇక రీసెంట్‌గా వచ్చిన 'ఇరుముడి(Irumudi)' సినిమా ఆమె కెరీర్‌కు బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఒకవైపు వరుస సినిమాలతో కెరీర్‌లో దూసుకుపోతూనే, మరోవైపు తన పదేళ్ల ప్రేమను పెళ్లిపీటలెక్కిచడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.