వైజాగ్‌లో కొత్త సినిమా అడ్డా.. లోకేశ్ ప్లాన్‌కు రానా ఓకే.!

admin
Published by Admin — November 14, 2026 in Andhra, Movies
News Image

సినీ రంగంలో అడుగుపెట్టాలని తపించే యువతకు ఏళ్ల తరబడి హైదరాబాద్‌(Hyderabad)లోని స్టూడియోలు, ఆఫీసుల చుట్టూ తిరగడమే ఒకే ఒక్క మార్గంగా ఉంటోంది. ఎలాంటి సినీ నేపథ్యం, ఆర్థిక వనరులు లేని ఎంతోమంది యువతీ యువకులు అవకాశాల కోసం పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎంతో ప్రతిభ ఉన్నా సరైన గైడెన్స్ లేక చాలా మంది కలలు అర్ధాంతరంగానే ఆగిపోతుంటాయి. ఈ గ్రౌండ్ రియాల్టీని గమనించిన ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్.. టాలీవుడ్ భవిష్యత్తును మార్చేసే ఒక వినూత్నమైన మాస్టర్ ప్లాన్‌కు తెరతీశారు.

కేవలం హీరోలు, దర్శకులే కాకుండా.. సినిమా ఇండస్ట్రీకి నటన, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్, స్టంట్స్ వంటి విభిన్న విభాగాల్లో అత్యుత్తమ నైపుణ్యం కలిగిన టెక్నీషియన్లు లక్షలాదిగా అవసరం అవుతున్నారు. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటూనే, స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా విశాఖపట్నంలో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ’ (Center of Excellence) పేరుతో ఒక సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను మంత్రి లోకేశ్ తెరపైకి తెచ్చారు.

రానా ఇన్‌స్టంట్ గ్రీన్ సిగ్నల్!
విశాఖ వేదికగా జరిగిన సీఐఐ (CII) సదస్సులో ప్రముఖ నటుడు, నిర్మాత దగ్గుబాటి రానా ఎదుట మంత్రి లోకేశ్(Nara Lokesh) ఈ ప్రాజెక్ట్ ఆలోచనను ఉంచారు. లోకేశ్ విజనరీ ఐడియాకు రానా(Rana) క్షణం కూడా ఆలోచించకుండా ఫిదా అయిపోయారు. ఈ ప్రతిపాదనకు వెంటనే సానుకూలంగా స్పందించడమే కాకుండా.. వచ్చే సోమవారం లోగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి స్థాయి బ్లూప్రింట్‌ను సిద్ధం చేయిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు, సరిగ్గా ఏడాదిలోపే విశాఖలో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ’ని గ్రౌండ్ చేసి చూపిస్తామని మాటిచ్చారు.

ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కనుక కార్యరూపం దాలిస్తే, ఏపీ యువత సినిమా నైపుణ్యాలను నేర్చుకోవడానికి హైదరాబాద్ చుట్టూ పరుగులు పెట్టాల్సిన అవసరం పూర్తిగా తొలగిపోతుంది. వైజాగ్‌(Vizag)లోనే అన్ని వసతులతో కూడిన సరికొత్త సినీ అడ్డా రూపుదిద్దుకోనుంది. పాలకుల ఆలోచనలు మూస పద్ధతిలో కాకుండా, ఇలా క్రియేటివ్‌గా ఉంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పాటు యువత భవిష్యత్తు ఎలా మారుతుందనడానికి ఈ పరిణామం అద్దం పడుతోంది.

Tags
Vizag Cinema Hub Nara Lokesh Rana Daggubati Center of Excellence Tollywood Andhra Pradesh Telugu Cinema
Recent Comments
Leave a Comment

Related News