ఇట్స్ అఫీషియ‌ల్‌.. ప‌వ‌న్ `ఓజీ` లో నారా వారి కోడ‌లు..!

admin
Published by Admin — May 29, 2025 in Movies
News Image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో `ఓజీ` ఒకటి. `సాహో` ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. డి.వి.వి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న‌ ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా.. ఇమ్రాన్ హష్మి విల‌న్ గా యాక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో శ‌ర‌వేగంగా చిత్రీకరణ జ‌రుగుతోంది.

సెప్టెంబర్ 25న ఓజీ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ తెరపైకి వచ్చింది. ప‌వ‌న్‌ ఓజీ చిత్రంలో నారా వారి కోడలు కూడా అలరించబోతుందట. అవును, మీరు విన్నది నిజమే. ప్రముఖ టాలీవుడ్ హీరో నారా రోహిత్ కు కాబోయే భార్య సిరీ లెల్లా ఓజీ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తోంద‌ట‌. ఈ విషయాన్ని నారా రోహిత్ స్వ‌యంగా కన్ఫర్మ్ చేశాడు.

ప్రస్తుతం `భైవ‌రం` మూవీ ప్రమోషన్స్ లో నారా రోహిత బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ మరియు సాయి ధ‌ర‌మ్ తేజ్‌ల‌తో కలిసి నారా రోహిత్ తో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓజీ అప్డేట్ చెప్పాలంటూ సాయి ధ‌ర‌మ్ తేజ్ అడ‌గ్గా.. అందుకు నారా రోహిత్ బ‌దులిచ్చాడు. ఓజీ సినిమాలో తనకు కాబోయే భార్య సిరీ లెల్లా న‌టిస్తోంద‌ని, ఓ ప్రత్యేకమైన పాత్ర కోసం ఆమెను తీసుకున్నార‌ని నారా రోహిత్‌ వెల్లడించాడు. ఇంత‌వ‌ర‌కు ఈ విష‌యం తెలియ‌ని మ‌నోజ్ ఒకింత షాక్ అయ్యాడు. ఇన్ని రోజులు ఈ సంగ‌తి ఎందుకు చెప్పలేదు మ‌చ్చా అంటూ నారా రోహిత్‌ను మ‌నోజ్ ఆట‌ప‌ట్టించాడు.

Tags
Bhairavam Latest news nara rohith
Recent Comments
Leave a Comment

Related News