ప్ర‌భాస్ చంపేస్తా అన్నాడు.. మంచు విష్ణు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

admin
Published by Admin — May 27, 2025 in Movies
News Image

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ `కన్నప్ప` ఎట్ట‌కేల‌కు విడుద‌ల అయ్యేందుకు ముస్తాబవుతోంది. విష్ణు టైటిల్ పాత్రలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 27న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్ వంటి స్టార్స్ రంగంలోకి దిగడంతో కన్నప్ప పై ఇప్పటికే మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రోవైపు విష్ణు కూడా ప్రమోషన్స్ లో వేగం పెంచాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు.. క‌న్న‌ప్ప‌ సినిమాకు సంబంధించి అనేక విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ గురించి సంచలన‌ వ్యాఖ్యలు చేశారు. కన్నప్పలో మొదట ప్రభాస్‌ను అతిథి పాత్ర కోసమే తీసుకున్నామ‌ని.. కానీ ఆ తర్వాత ఆయ‌న పాత్ర నిడివిని 30 నిమిషాలు పెంచామ‌ని విష్ణు తెలిపాడు. మోహన్ బాబు, ప్రభాస్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయ‌ని పేర్కొన్నాడు.

అలాగే కన్నప్ప సినిమాను భారీ స్థాయిలో తెర‌కెక్కించ‌డానికి ప్ర‌భాసే కార‌ణ‌మ‌న్నాడు విష్ణు. `కన్నప్పను ముందు నుంచి ప్రభాస్ ఎంతగానో సపోర్ట్ చేస్తూ వచ్చాడు. ఇందులో పాత్ర‌ గురించి చెప్పగానే మరో మాట లేకుండా చేస్తా అన్నాడు. అందుకు ఎంత ఇవ్వడానికైనా నేను రెడీ. కానీ రెమ్యున‌రేష‌న్ పేరు ఎత్తితే చంపేస్తా అన్నాడు. పైసా తీసుకోకుండా నాన్న గారిపై అభిమానంతో కన్నప్పలో నటించాడు. సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని ఎంకరేజ్ చేశాడు. సొంత‌వారే నా పంతాన్ని కోరుకుంటున్న సమయంలో.. ప్రభాస్ లాంటి స్టార్ అండగా నిలబడటం చాలా సంతోషాన్ని ఇచ్చింది` అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. దీంతో ప్ర‌భాస్ గొప్ప‌త‌నం ఏంటో మ‌రోసారి రుజువైంద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Tags
kannappa kannappa movie Manchu vishnu pan india movie
Recent Comments
Leave a Comment

Related News