అనిల్ స్పీడుతో చిరంజీవికి పెద్ద చిక్కే వ‌చ్చిందిగా..!

admin
Published by Admin — May 26, 2025 in Movies
News Image

టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ఆరంభం నుంచి అపజయం ఎరగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్.. సినిమా ప్రమోషన్స్ విషయంలో తన రూటే సపరేట్ అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. సినిమా మొత్తం పూర్తయ్యాక ప్రమోషన్స్ మొదలు పెడుతుంటారు దర్శకులు. కానీ సినిమా ప్రారంభం కాకముందే ప్రమోషన్స్ షురూ చేయడం అనిల్ రావిపూడి స్టైల్. తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ `మెగా 157` విషయంలో కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రమిది. నయనతార హీరోయిన్ గా ఎంపికయింది.

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైమెంట్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మైన ఈ చిత్రం ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లింది. ఓవైపు ప్ర‌మెష‌న్స్‌, మ‌రోవైపు షూటింగ్ విష‌యంలో అనిల్ య‌మా స్పీడ్ చూపిస్తున్నారు. అయితే ఇప్పుడాయ‌న‌ స్పీడ్ చిరంజీవికి పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం చిరు చేతిలో `మెగా 157` ప్రాజెక్ట్ తో పాటుగా `విశ్వంభర` కూడా ఉంది. మల్లిడి వసిష్ఠ డైరెక్ట్ చేస్తున్న సోసియో-ఫాంటసీ చిత్రమే విశ్వంభర. చిరంజీవి కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. షూటింగ్ ఆల్మోస్ట్ తుది దశ‌కు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మొదట్లో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి

కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. అనిల్ రావిపూడి చేస్తున్న ప్రమోషన్స్ దెబ్బకు అందరి చూపు మెగా 157 వైపే మళ్ళింది. ఈ ప్రాజెక్టు విషయంలో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. కానీ విశ్వంభ‌ర‌ విషయంలో అటువంటి జోష్ ఏమాత్రం కనిపించడం లేదు. కొందరైతే అసలు విశ్వంభర సినిమా ఉందన్న సంగతే మరచిపోతున్నారు. టీజర్ తర్వాత ఆ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ లేదు. ఇటీవల కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్ లో నిర్మాత విక్రమ్‌ రెడ్డి విశ్వంభ‌ర‌కు సంబంధించి ఒక బుక్ లాంచ్ చేశారు. దానివల్ల సినిమాపై ఏమైనా బజ్ క్రియేట్ అయిందా అంటే అదీ లేదు. ఇంతవరకు విడుదలపై కూడా మేకర్స్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేప‌థ్యంలోనే విశ్వంభ‌ర కోసం అనిల్ రావిపూడిని కాస్త స్పీడ్ త‌గ్గించాల‌ని చిరు సూచించార‌ట‌.

Tags
anil ravipudi chiranjeevi Latest news Mega 157
Recent Comments
Leave a Comment

Related News