వారణాసిలో శివ భక్తుడిగా ప్రకాష్ రాజ్

admin
Published by Admin — February 19, 2026 in Movies
News Image

ఒకప్పుడు తెలుగులో పది సినిమాలు తెరకెక్కితే అందులో సగం చిత్రాల్లో ప్రకాష్ రాజ్ కనిపించేవాడు. విలన్, క్యారెక్టర్ పాత్రల్లో ఆయన ఆధిపత్యం ఆ స్థాయిలో ఉండేది. తన కెరీర్లో అత్యధిక చిత్రాలు చేసింది కూడా తెలుగులోనే. అలాంటి నటుడు.. కొన్నేళ్ల పాటు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయని స్థితికి చేరుకున్నాడు. 

మొత్తంగా కూడా సినిమాలు తగ్గించేసి రాజకీయాలు, వ్యవసాయం, సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యారు ప్రకాష్ రాజ్. కానీ తర్వాత ఆయనకు మళ్లీ సినిమాలపైకి మనసు మళ్లింది. ఒకప్పటి స్థాయిలో కాకపోయినా.. ఈ మధ్య తరచుగానే సినిమాల్లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ సినిమాలోనే మోస్ట్ అవైటెడ్ అనదగ్గ రెండు చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషిస్తున్నారు. అందులో ఒకటి వారణాసి కాగా.. ఇంకోటి స్పిరిట్.

‘స్పిరిట్’ సినిమా నుంచి తప్పుకున్నట్లు ఇటీవల వచ్చిన వార్తలను కూడా ఆయన ఖండించిన సంగతి తెలిసిందే. అందులో ఆయన చేస్తోంది పోలీస్ పాత్ర అని గత ఏడాది రిలీజ్ చేసి ఆడియో గ్లింప్స్‌తోనే అర్థమైంది. మరి ‘వారణాసి’లో ప్రకాష్ రాజ్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడన్నది ఆసక్తికరం. ఆ విషయాన్ని టీం కంటే ముందు ప్రకాష్ రాజ్ బయటపెట్టేశారు. తాను ఆ సినిమాలో శివభక్తుడి పాత్ర పోషిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఒక కార్యక్రమంలో తాను చేస్తున్న సినిమాల గురించి చర్చ వచ్చినపుడు.. ప్రకాష్ రాజ్ ఈ విషయం ప్రస్తావించారు. హిందీ ‘దృశ్యం-3’లో తాను నటిస్తున్న విషయాన్ని కూడా ఆయన ధ్రువీకరించారు. 

‘వారణాసి’లో పురాణాలకు సంబంధించి 25 నిమిషాల ఎపిసోడ్ ఉంటుందని రాజమౌళి వెల్లడించిన సంగతి తెలిసిందే. మరి అప్పుడే ప్రకాష్ రాజ్ పాత్ర వస్తుందా.. ఆయన పాత్రలోనూ మైథాలజీ టచ్ ఉంటుందా అన్న ఆసక్తి కలుగుతోంది. ఇన్నేళ్లలో రాజమౌళితో కలిసి పని చేసింది ‘విక్రమార్కుడు’లోని చిన్న పాత్ర కోసమే. ఆయన సినిమాల్లో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ మాత్రం చేసింది లేదు. ఇప్పుడు ఈ విలక్షణ నటుడి కోసం రాజమౌళి ఎలాంటి పాత్ర ఆఫర్ చేశాడో?

Tags
Prakash raj lord siva's devotee Varanasi movie
Recent Comments
Leave a Comment

Related News