తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాలని భావిస్తున్న `దళపతి` విజయ్‌కు సొంత ఇంట్లోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఒకవైపు 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం `తమిళగ వెట్రి కళగం` (TVK) పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ఆయన శక్తివంచన లేకుండా కృషి చేస్తుంటే, మరోవైపు ఆయన వ్యక్తిగత జీవితంలో రేగుతున్న గొడవలు ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా విజయ్ వారసుడు జాసన్ సంజయ్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
గత కొంతకాలంగా విజయ్(Vijay), ఆయన భార్య సంగీత మధ్య విబేధాలు ఉన్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే, తాజాగా ఆ ప్రచారం నిజమేనని నమ్మేలా పరిస్థితులు మారిపోయాయి. సంగీత విడాకుల కోసం కోర్టు మెట్లెక్కడం ఒక్కసారిగా అందరినీ విస్తుపోయేలా చేసింది. తన పిటిషన్‌లో ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో దావాగ్నిలా వ్యాపిస్తున్నాయి. విజయ్‌కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందంటూ ఆమె పేర్కొన్న అంశాలు, ఒక క్రమశిక్షణ గల నాయకుడిగా ఎదగాలని చూస్తున్న దళపతి ప్రతిష్టను మసకబారుస్తున్నాయి.
తండ్రికి వారసుడి `డిజిటల్` షాక్!
కుటుంబ కలహాల పర్వం ఇంతటితో ఆగలేదు. తల్లి పడుతున్న ఆవేదనను చూసి చలించిపోయిన విజయ్ తనయుడు జాసన్ సంజయ్(Jason Sanjay), తన తండ్రికి ఊహించని షాక్ ఇచ్చాడు. నూటికి నూరు శాతం తల్లి వైపే మొగ్గు చూపిన సంజయ్, తన నిరసనను డిజిటల్ వేదికగా చాటాడు. తన తండ్రిని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం ద్వారా వారి మధ్య ఉన్న దూరం ఎంత పెరిగిందో స్పష్టం చేశాడు. ఒక తండ్రిగా, ఒక ఎదుగుతున్న రాజకీయ నాయకుడిగా విజయ్‌కు ఇది కోలుకోలేని దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.