సలార్-2 అప్‌డేట్ ఇచ్చిన నిర్మాత

admin
Published by Admin — March 05, 2026 in Movies
News Image
తాను ప్రొడ్యూస్ చేసి, బ్లాక్ బస్టర్ అయిన ఓ భారీ చిత్రం గురించి.. దాని నిర్మాతే కొంచెం తక్కువ చేసి మాట్లాడ్డం అరుదు. ‘సలార్’ (salaar)నిర్మాత విజయ్ కిరగందూర్(producer vijay kirangadoor) ఇంతకుముందు ఆ రకమైన కామెంట్లే చేసి ఆశ్చర్యపరిచాడు. ఆ సినిమా తనకు పూర్తి సంతృప్తినివ్వలేదని చెప్పుకొచ్చాడు. ప్రభాస్(prabhas) హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్నందుకుంది. 
 
‘బాహుబలి’ తర్వాత మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు ‘సలార్’ గొప్ప ఉపశమనాన్ని ఇచ్చింది. భారీ విజయాన్ని అందుకుంది. ఓటీటీలో అంతకుమించి అద్భుత స్పందన తెచ్చుకుందీ చిత్రం. తాను ఇంతకుముందు ‘సలార్’ గురించి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ.. ‘సలార్-2’ మామూలుగా ఉండదంటూ ఊరించాడు విజయ్. పనిలో పనిగా ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టడానికి సన్నాహాలు కూడా చేస్తున్నట్లు ఆయన అప్‌డేట్ ఇచ్చారు.
 
‘‘‘సలార్’ మొదటి భాగం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్నందుకుంది. ఓటీటీలో అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.  ఇండస్ట్రీలో ఉన్న గొప్ప దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరు. ఆయన స్వీయ విమర్శ చేసుకోవడంలో ముందుంటారు. అలా చేసుకునే ‘సలార్-2’ను ఇంకా గొప్పగా తీయడానికి సిద్ధమయ్యారు. సలార్-2(salaar-2) అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. దీని అప్‌డేట్ల కోసం అభిమానులు అడుగుతూనే ఉన్నారు. అవి మా దృష్టికి వచ్చాయి. త్వరలోనే షూటింగ్ మొదలుపెడతాం.
 
ఆ విషయం మీ అందరితో పంచుకోవడం ఆనందంగా ఉంది’’ అని విజయ్ తెలిపాడు. ‘సలార్-1’ను ‘సీజ్ ఫైర్’ పేరుతో రూపొందించాడు ప్రశాంత్ నీల్(prasant neel). చివర్లో ‘శౌర్యాంగపర్వం’ పేరుతో రాబోయే సెకండ్ పార్ట్ గురించి లీడ్ ఇచ్చారు. శౌర్యాంగుడిగా ప్రభాస్ విశ్వరూపాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నాం. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇవి ఒక కొలిక్కి వచ్చాక ఈ ఏడాది ద్వితీయార్ధంలో ‘సలార్-2’ పట్టాలెక్కే అవకాశముంది. ఈ లోపు ఎన్టీఆర్ సినిమాను ప్రశాంత్ పూర్తి చేస్తాడు.
Tags
director prasanth neel hero prabhas salaar 2 movie producer vijay kirangadoor update
Recent Comments
Leave a Comment

Related News