యుద్ధం ఆపేందుకు ఇరాన్ రెడీ...కానీ...

admin
Published by Admin — March 13, 2026 in International
News Image

అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త యుద్ధం నేప‌థ్యంలో ఇరాన్(Iran) కూడా అంతే తీవ్రంగా ప్ర‌తిఘ‌టిస్తోంది. చిన్న‌దేశ‌మే అయినా.. ఉన్న‌వి చిన్న‌వ‌న‌రులే అయినా.. వ్యూహాత్మ‌క దాడితో అమెరికాను, తద్వారా ప్ర‌పంచ దేశాల‌ను కూడా ఇరాన్ వ‌ణికిస్తోంది. ఇప్ప‌టికే జ‌ర్మ‌నీ, జ‌పాన్ స‌హా ప‌లు దేశాలు చ‌మురు సంక్షోభాన్నిఎదుర్కొంటున్నాయి. అమెరికా కూడా దాచిన నిల్వ‌ల‌ను తీయాల్సి వ‌స్తోంద‌ని తెలిపింది. భార‌త్ వంటి అతి పెద్ద‌దేశాలు కూడా.. ఇప్పుడు ఇరుకున ప‌డుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో యుద్ధం విర‌మించాలంటూ.. అటు అమెరికా(America), ఇజ్రాయెల్‌(Israel)పైనా.. ఇటు ఇరాన్‌పై కూడా ఒత్తిడి పెరుగుతోంది. పైకి యుద్ధం కొన‌సాగుతుంద‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ప్ర‌క‌టిస్తున్నా.. అంత‌ర్గ త రాజ‌కీయాల‌ను గ‌మ‌నిస్తే.. ఇది అంత సాధ్యం కాక‌పోవ‌చ్చ‌ని తెలుస్తోంది. దాదాపు సెనేట్ రెండుగా చీలిపోయింది. యుద్ధం త‌క్ష‌ణం ఆపేయాల‌న్న ప్ర‌జా్ప్ర‌తినిధుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్ర‌మంలో అమెరికా అధ్య‌క్షుడు ఒక మెట్టు దిగే ప్ర‌య‌త్నంలో ఉన్నారు.

దీనిని గ‌మ‌నించిన ఇరాన్.. తాము కూడా యుద్ధం(war) ముగిస్తామ‌ని.. ప్ర‌క‌టించింది. కానీ, ట్రంప్‌పై పెరుగుతు న్న ఒత్తిడిన గ‌మనించిన టెహ్రాన్‌.. యుద్ధం ముగించేందుకు మూడు ష‌ర‌తులు(3 conditions) విధించింది. ఈ ష‌ర‌తుల ను ప‌ట్టించుకుని ఓకే అంటే.. వెంట‌నే యుద్ధాన్ని ఆపేస్తామ‌ని ఇరాన్ అధ్య‌క్షుడు మ‌సూద్ షెజెష్కియాన్ ప్ర‌క‌టించారు. ఈ ష‌ర‌తులు ఇరాన్ సార్వ‌భౌమాధికారం కోస‌మేన‌ని చెప్పారు. దీనిని ప్ర‌పంచ దేశాలు కూడా గ‌మ‌నించాల‌ని ఆయ‌న విన్నవించారు. యుద్దం చేయాల‌ని తాము కోరుకోవ‌డం లేద‌ని.. అమెరికానే దీనికి ప్రాణం పోసింద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

ఏంటా ష‌ర‌తులు..

1) ఇరాన్ చ‌ట్టాన్ని.. చ‌ట్ట బ‌ద్ధ హ‌క్కుల‌ను కాపాడాలి. ఇత‌ర దేశాలు జోక్యం చేసుకోకూడదు.

2) ప్ర‌స్తుతం యుద్ధం కార‌ణంగా ఇరాన్‌కు జ‌రిగి వేల కోట్ల రూపాయ‌ల న‌ష్టాన్ని అమెరికా, ఇజ్రాయెల్  సంయుక్తంగా చెల్లించాలి.

3) ఫ్యూచ‌ర్‌లో ఎలాంటి దాడులు చేయ‌బోమ‌ని.. అంత‌ర్జాతీయ ఒప్పందం చేసుకోవాలి.

ట్రంప్ ఒప్పుకొంటాడా?

అయితే.. ఇరాన్ ఇన్ని ష‌ర‌తులు పెట్టిన ద‌రిమిలా.. ట్రంప్ ఒప్పుకొంటారా? అనేది ప్ర‌శ్న‌. అసలు ఇరాన్ కొత్త సుప్రీం లీడ‌ర్ ఎన్నిక విష‌యంలోనే ఆయ‌న క‌స్సుబుస్సులాడారు. అంతేకాదు.. అమెరికాను అనుకూలంగా ఉన్న‌వారినే సుప్రీంలీడ‌ర్‌గా ఎంపిక చేయాల‌ని కూడా తేల్చి చెప్పారు. అలాంటి ట్రంప్‌.. ఇప్పుడు ష‌ర‌తుల‌కు ఒప్పుకొని యుద్ధం ఆపేస్తార‌ని అనుకోవ‌డం ప్ర‌శ్న‌గానే మిగులుతోంది.

Tags
Iran Israel America war three conditions sieze fire stop war
Recent Comments
Leave a Comment

Related News