బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA) తన ఫ్లాగ్‌షిప్ వార్షిక ఉగాది వేడుకలను మార్చి 21, 2026న మిల్పిటాస్‌లోని ఇండియా కమ్యూనిటీ సెంటర్‌లో అంగరంగవైభవంగా నిర్వహించింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వేడుకలు ఘనంగా జరిగాయి. బే ఏరియాలోని తెలుగు ప్రజలంతా ఈ వేడుకలకు హాజరయ్యారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయం మరియు సమాజ స్ఫూర్తితో అంతా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ఉగాది పండుగ సారాంశం, సంప్రదాయాలను సూచించే ఉగాది పచ్చడిని అందరూ ఆస్వాదించారు. పాటల పోటీలు, నృత్య పోటీలలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. టాలీవుడ్, శాస్త్రీయ విభాగాలతోపాటు అనేక కేటగిరీలలో పోటీలు జరిగాయి. ఈ సంవత్సరం BATA యువత ప్రతిభా పోటీల యొక్క 25వ వార్షికోత్సవం కావడం విశేషం. పోటీల కోసం పలు గదులు కేటాయించారు. పిల్లలు, యువత మరియు పెద్దలు అందరూ ఈవెంట్ అంతా ఉత్సాహంగా కలియదిరిగారు. వేదిక రంగులతో నిండి, రద్దీగా ఉంది.
సాయంత్రం నిర్వహించిన పాటల కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా మారింది. 1990ల తెలుగు సినిమా బంగారు యుగం థీమ్‌పై నిర్వహించిన ఈ కార్యక్రమంలో పిల్లలు, యువత మరియు పెద్దలు చేసిన ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక ప్రదర్శనలు తెలుగు వారసత్వ సారాంశాన్ని అందంగా చూపాయి. గ్రాండ్ ఫినాలేగా, ప్రముఖ టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ అంజన సౌమ్య సంగీత ప్రదర్శన అలరించింది. ఈ ఈవెంట్‌కు అనేకబంది ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు.
సాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియా కాన్సులేట్ నుంచి అభిషేక్ శర్మ హాజరయ్యారు. BATA చేస్తున్న ఈ తరహా కార్యక్రమాలను ఆయన మెచ్చుకున్నారు. బే ఏరియాలో తెలుగు భాష మరియు సంస్కృతిని కాపాడటం మరియు ప్రోత్సహించడం, ముఖ్యంగా యువ తరం, పాత తరం మధ్య సంబంధాలను పెంపొందించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు.
సాంటా క్లారా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ జెఫ్ రోసెన్, ఫ్రెమాంట్ సిటీ మేయర్ రాజ్ సల్వాన్, మిల్పిటాస్ సిటీ మేయర్ కార్మెన్ మాంటానోలు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని, సమావేశాన్ని ఉద్దేశించి, హాజరైనవారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, BATA ఇమ్మిగ్రేషన్ అంశాలపై ఓ కార్యక్రమం నిర్వహించింది. స్థానిక న్యాయ నిపుణులు అటార్నీలు నవదీప్ తూర్ మీంబర్ మరియు మనోహర్ టి. రెడ్డి ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
“Protect Your Status: 2026 Immigration Updates for Professionals and Families” అనే అంశంపై చర్చించారు. అటార్నీలు కల్పన వి. పెద్దిభోట్ల మరియు కోమి విశాఖన్ “Home and Belonging: The South Asian Future in America” అనే అంశంపై మాట్లాడారు.ఈ ఈవెంట్‌కు పలువురు స్పాన్సర్లుగా వ్యవహరించారు.
సంజీవ్ గుప్తా CPA గ్రాండ్ స్పాన్సర్‌గా, రియల్టర్ నాగరాజ్ అన్నయ్య “Powered By” స్పాన్సర్‌గా, గోల్డ్ స్పాన్సర్‌గా శ్రీని గోలి రియల్ ఎస్టేట్స్ ఉన్నారు. ఇతర స్పాన్సర్లలో Insta Service, PNG Jewelers, APEX Consulting, Kavya Foods, మరియు Paatasala (తెలుగు స్కూల్) ఉన్నాయి. Sri’s Kitchen ఫుడ్ స్పాన్సర్‌గా వ్యవహరించింది.
ఈ ఈవెంట్‌లో దుస్తులు, నగలు, ఫ్యాషన్, ఇన్వెస్ట్‌మెంట్స్, విద్య మరియు రియల్ ఎస్టేట్ సేవలను ప్రదర్శించే అనేక వెండర్ బూత్‌లు ఆకట్టుకున్నాయి. ఈ ఈవెంట్ కు హాజరైనవారు, పాల్గొనేవారు, వెండర్లు, స్పాన్సర్లు మరియు వాలంటీర్లందరికీ బాటా అధ్యక్షఉడు శివ.కె ధన్యవాదాలు తెలిపారు. BATA ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రేక్షకులకు ఆయన పరిచయం చేశారు.
బాటా ఎగ్జిక్యూటివ్ కమిటీలో వరుణ్, హరి ఎస్., సందీప్ కె., సంకేత్....కల్చరల్ కమిటీలో... శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, శిరీషా బత్తుల, తారక దీప్తి, కిరణ్ విన్నకోట ఉన్నారు. లాజిస్టిక్స్ టీమ్‌లో సురేష్ సివపురం, రవి పొచిరాజు, హరీష్ ఇనంపూడి, సుధాకర్ బైరి ఉన్నారు. యూత్ కమిటీలో ఉదయ్, గౌతమి, సింధు ఉన్నారు. ఆర్ట్ & డిజైన్ కమిటీలో కల్యాణి, కృష్ణ ప్రియ, దీప్తి, శ్రావంతి ఉన్నారు. స్టీరింగ్ కమిటీలో రవి తిరువీధేల, కామేశ్ మల్ల, యశ్వంత్ కుదరవల్లి, సుమంత్ పుసులూరి ఉన్నారు.
BATA అడ్వైజరీ బోర్డులో జయరాం కొమటి, విజయ అసూరి, వీరు వుప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండ, కల్యాణ్ కట్టమూరి, హరినాథ్ చికోటి ఉన్నారు. బాటా టీమ్‌ను వారు అభినందించారు.