రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్ తమిళ హీరోయిన్ త్రిషది. తమిళంతో పాటు తెలుగులోనూ ఒక దశలో టాప్ హీరోయిన్‌గా కొనసాగింది. హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఆమె నటించింది. ఒక దశలో అవకాశాలు తగ్గి, పెళ్లికి రెడీ అవడంతో ఆమె కెరీర్ ముగిసిందని అనుకున్నారు కానీ... ఆ పెళ్లి క్యాన్సిల్ కావడం, మళ్లీ సినిమాల్లో బిజీ కావడం.. పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో భాగం కావడం.. ఇలా తన కెరీర్లో మిరాకిల్స్ జరిగాయి. గత ఏడాది కూడా విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ, థగ్ లైఫ్ లాంటి పెద్ద సినిమాల్లో నటించింది త్రిష. ఐతే ఈ మధ్య తన కొత్త చిత్రాలేవీ అనౌన్స్ కాలేదు. కాగా త్రిషకు అవకాశాలు రాకేమీ కాదని.. ఆమెకే ఇకపై సినిమాల్లో నటించే ఉద్దేశం లేదని.. ఆమె నటనకు గుడ్‌బై చెప్పేయబోతోందని ప్రచారం జరుగుతోంది. ఇది ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన అంశం.
చిత్ర లక్ష్మణన్ అనే సీనియర్ తమిళ నటుడు, జర్నలిస్ట్.. త్రిష కెరీర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్రిష నటనకు గుడ్‌బై చెప్పబోతోందని ఆయన సంకేతాలు ఇచ్చారు. త్రిష కొంత కాలంగా సినిమాలేవీ ఒప్పుకోవడం లేదని.. ఇకపై ఆమెకు నటించే ఉద్దేశం లేనట్లుందని చిత్ర లక్ష్మణన్ వ్యాఖ్యానించారు. చిత్ర లక్ష్మణన్ సాధారణ వ్యక్తేమీ కాదు. తమిళ ఇండస్ట్రీలో ఆయనకు మంచి పేరే ఉంది. పూర్తి సమాచారం ఉంటే తప్ప ఆయన ఇలా వ్యాఖ్యానించి ఉండరని భావిస్తున్నారు. త్రిషకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందని.. విజయ్ పార్టీలో ఆమె చేరొచ్చని మరోవైపు ప్రచారం జరుగుతోంది. త్రిష, విజయ్‌ల వ్యక్తిగత బంధం గురించి ఇటీవల పెద్ద చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. తన భార్య సంగీత నుంచి విడాకులు తీసుకున్నాక త్రిషను విజయ్ పెళ్లి చేసుకోవచ్చని అంటున్నారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉన్నట్లు గతంలో త్రిష వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక విజయ్‌కి వ్యక్తిగతంగానే కాక రాజకీయంగా కూడా అండగా నిలిచే ఉద్దేశంతోనే త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పేయబోతోందనే చర్చ జరుగుతోంది తమిళనాట.