హ‌రీష్‌రావు అరెస్టు..!

admin
Published by Admin — April 07, 2026 in Telangana
News Image

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ పార్టీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీష్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. మంగ‌ళ‌వారం హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌లోని త‌న ఇంటి నుంచి ప‌రిగి ప‌ర్య‌ట‌న కు బ‌య‌లు దేరారు. అయితే.. ఉద‌యాన్నే ఆయ‌న నివాసానికి చేరుకున్న పోలీసులు.. తొలుత గృహ నిర్బంధం చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో పోలీసులు, హ‌రీష్‌రావుకు మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది.

అనంత‌రం.. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు హ‌రీష్‌రావు ప్ర‌య‌త్నించ‌డంతో పోలీసులు ఆయ‌న ను అదుపులోకి తీసుకుని స్టేష‌న్‌కు త‌ర‌లించారు. మ‌రోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ధ‌ర్నాకు దిగారు. ప‌రిగిలో పేద‌ల నుంచి పారిశ్రామిక కారిడార్ నిర్మాణం కోసం భూములు తీసుకోవ‌డాన్ని నిర‌సిస్తూ.. బీఆర్ ఎస్ నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చింది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప‌లువురు మాజీ మంత్రులు నిర‌స‌న‌ల‌కు బ‌య‌ట‌కు వ‌చ్చారు.

అయితే.. పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్క‌డిక‌క్క‌డ మాజీ మంత్రులు, బీఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌ను నిలువ రించారు. కొంద‌రిని గృహ నిర్బంధం కూడా చేశారు. ఈ క్ర‌మంలో ప‌లు చోట్ల పోలీసుల‌కు, బీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌ల‌కు మ‌ధ్య తోపులాట‌లు, స్వ‌ల్ప ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్నాయి. దీంతో ప‌రిగి స‌హా ప‌లు ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్ష‌న్ విధించారు. ముఖ్యంగా హ‌రీష్‌రావు ఇంటి ముందు కూడా 144 సెక్ష‌న్ విధించారు.

ఇదిలావుంటే.. హ‌రీష్‌రావు అరెస్టు, రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై మాజీ సీఎం బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. పార్టీ నాయ‌కుల‌కు ఫోన్ చేసి స‌మాచారం తెలుసుకున్నారు. పార్టీ ప‌రంగా అంద‌రికీ అండ‌గా ఉంటామ‌ని.. ప‌రిగి నిర్వాసితుల ప‌క్షాన బ‌లంగా పోరాడాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గాల్సిన‌ అవ‌స‌రం లేద‌ని వ్యాఖ్యానించిన‌ట్టు పార్టీ వ‌ర్గాల నుంచి స‌మాచారం అందింది. 

Tags
Harish rao arrested
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News