మెగా కోడ‌లికి ద‌ర్శ‌కుడి వేధింపులు.. వెలుగులోకి సంచ‌ల‌న నిజాలు!

admin
Published by Admin — May 17, 2026 in Movies
News Image

చిత్ర పరిశ్రమలో గ్లామర్ ప్రపంచం వెనుక ఉండే చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా మెగా కోడలు, టాలీవుడ్(Tollywood) స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. వెండితెరపై ఎంతో హుందాగా కనిపించే ఈ ముద్దుగుమ్మ, కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభ‌వాల‌ను వివరిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

కెరీర్ తొలినాళ్లలో ఒక తమిళ సినిమా షూటింగ్ సమయంలో సదరు దర్శకుడు తనతో అత్యంత అసభ్యంగా ప్రవర్తించాడని లావణ్య(Lavanya) వెల్లడించింది. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం ఇష్టం లేక, ప్రాజెక్ట్ మధ్యలోనే ఆ సినిమాను నిర్మొహమాటంగా వదిలేశానని చెప్పింది. అయితే, అక్కడితో ఆ వివాదం ముగిసిపోలేదు. సినిమా నుంచి తప్పుకున్నందుకు కక్షగట్టిన చిత్రబృందం, ఆమెపై ఏకంగా కోర్టులో కేసు వేసి వేధించడమే కాకుండా, మీడియాను వాడుకుని లావణ్య క్యారెక్టర్‌ను బ్యాడ్ చేస్తూ తప్పుడు కథనాలు రాయించారని ఆరోపించింది. ఆ చిన్న వయసులో జరిగిన ఈ మానసిక దాడితో తాను తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయానని, కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని ఆమె ఎమోషనల్ అయ్యింది.

ఈ చేదు జ్ఞాపకాలతో పాటు తన కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను కూడా లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) పంచుకుంది. తెలుగులో రికార్డులు సృష్టించిన ‘గీత గోవిందం’ సినిమాలో హీరోయిన్‌గా మొదట అనుకుంది తననేనని, కానీ అప్పటికే ఒప్పుకున్న ఇతర సినిమాల డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే ఆ భారీ ఆఫర్‌ను వదులుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. ఒకవేళ ఆ సినిమా చేసి ఉంటే తన కెరీర్ గ్రాఫ్ మరోలా ఉండేదని అభిప్రాయపడింది.

ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌(Varun Tej)తో ప్రేమ, పెళ్లి ప్రయాణం గురించి చెప్తూ.. ఒక సినిమా ఈవెంట్‌లో వరుణ్ కళ్లను చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయానని సిగ్గుపడుతూ చెప్పింది. వరుణ్ తనకు ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తాడని, ఇద్దరి మధ్య ఎప్పుడైనా చిన్నపాటి గొడవలు వస్తే వరుణ్ వాదిస్తుంటే, తాను మాత్రం సైలెంట్‌గా ఉండి గొడవను సర్దుమణిగేలా చేస్తానని వారి సీక్రెట్ లీక్ చేసింది.

Tags
Lavanya Tripathi Varun Tej Mega Family Tollywood Lavanya
Recent Comments
Leave a Comment

Related News