నారా దేవాన్ష్ యూట్యూబ్ ఛానెల్ `Dino Deets`..ట్రెండింగ్

admin
Published by Admin — May 17, 2026 in Andhra
News Image

టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. రాజకీయ చదరంగంలో తిరుగులేని గ్రాండ్ మాస్టర్ గా పేరు పొందిన తన తాత, ఏపీ సీఎం చంద్రబాబుకు తగ్గ మనవడిగా చదరంగంలో లిటిల్ మాస్టర్ దేవాన్ష్ రాణిస్తున్నాడు. క్లిష్టమైన 175 పజిల్స్‌ను వేగంగా పరిష్కరించి ‘ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్’గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించాడు దేవాన్ష్. ఇక, తాజాగా తన క్రియేటివిటీకి పదును పెడుతూ దేవాన్ష్ సొంతగా ఒక యూట్యూబ్ ఛానెల్  `Dino Deets`ను దేవాన్ష్ ఈ రోజు లాంచ్ చేశాడు. ఇక, తన త‌న‌యుడి యూట్యూబ్ ఛానెల్ లాంచ్ టీజ‌ర్‌లో తండ్రి లోకేష్ కూడా తళుక్కున మెరవడం విశేషం. ఈ సందర్భంగా దేవాన్ష్‌ కు నారా, నంద‌మూరి కుటుంబ‌స‌భ్యులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

డైనోసార్లు, శిలాజాలు (fossils), పురాత‌న అవ‌శేషాల గురించి ఆశ్చర్యపరిచే నిజాలను నవ్వుతూ ఈ ఛానెల్ ద్వారా దేవాన్ష్ వివరించనున్నారు. డైనోసార్లకు సంబంధించిన వింత‌లు, విశేషాలును ఆక‌ట్టుకునే శైలిలో ఆలోచింప‌జేసేలా దేవాన్ష్ పాడ్ కాస్ట్‌లు ఈ యూట్యూబ్ చాన‌ల్ ద్వారా ప్రజలతో పంచుకోనున్నాడు. దేవాన్ష్ సృష్టించిన ప్రాచీన ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు తాను కూడా ఒక ప్రేక్ష‌కుడిలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నానని లోకేష్ అన్నారు. ప్రస్తుతం  నారా దేవాన్ష్ యూట్యూబ్ ఛానెల్ `Dino Deets`.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.


`Dino Deets` ఛానెల్ లింక్స్

YouTube - https://youtube.com/@dinodeets  

Instagram - https://www.instagram.com/dinodeets/

Facebook - https://www.facebook.com/DinoDeets/

#DinoDeets
#DevaanshPodcast

Tags
nara devansh nara lokesh Dino deets youtube channel podcast dinosaurs
Recent Comments
Leave a Comment

Related News