మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్ వచ్చేసింది. గ్లోబల్ వైడ్‌గా భారీ అంచనాలున్న ఆయన లేటెస్ట్ సెన్సేషన్ ‘పెద్ది’ థియేట్రికల్ ట్రైలర్(Peddi Trailer) ఎట్టకేలకు విడుదలైంది. ముంబై వేదికగా జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో మేకర్స్ ఈ విజువల్ ట్రీట్‌ను లాంచ్ చేశారు. సినిమా రిలీజ్ డేట్ రెండుసార్లు వాయిదా పడి నిరాశలో ఉన్న అభిమానులకు, ఈ ట్రైలర్ మాత్రం అంతకుమించి అనేలా అసలైన మెగా విందును అందించింది.
ట్రైలర్ చూస్తుంటే డైరెక్టర్ బుచ్చిబాబు సన మరోసారి బాక్సాఫీస్ దగ్గర రూరల్ ఎమోషన్స్‌తో మ్యాజిక్ చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది. బెల్లం ఫ్యాక్టరీలో పనిచేసే ఒక సాధారణ కూలీ.. క్రికెట్, కుస్తీ లాంటి క్రీడల్లో తన సత్తా చాటుతూ ఎలా ఎదిగాడనే పాయింట్‌ను పవర్‌ఫుల్‌గా చూపించారు. ముఖ్యంగా రామ్ చరణ్(Ram Charan) రగ్గడ్ లుక్, ఆయన పలికించిన రౌద్రం, యాక్షన్ సీక్వెన్స్‌లు స్క్రీన్‌పై ర్యాంప్ ఆడించేశాయి అనే చెప్పాలి. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు గుండెల్ని పిండేసే ఎమోషన్ కూడా ఈ సినిమాలో గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapur) హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఫ్రెష్‌గా ఉండబోతోందని ట్రైలర్ హింట్ ఇచ్చింది. ఇక కన్నడ లెజెండరీ యాక్టర్ శివరాజ్ కుమార్, టాలెంటెడ్ విలన్ జగపతిబాబు, దివ్యేందు వంటి స్టార్స్ ఉనికి సినిమాకు మరింత వెయిట్ పెంచింది. వీటన్నింటికీ తోడు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్స్ కాగా, ఇప్పుడు ట్రైలర్ కట్ సినిమాపై అంచనాలను స్కై హైకి చేర్చింది.