ఎన్టీఆర్, బాలయ్యల రేర్ రికార్డ్.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్!

admin
Published by Admin — May 28, 2026 in Movies
News Image

తెలుగు చలనచిత్ర ప్రపంచంలో ఎందరో నటీనటులు తమ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. కానీ, ఒకే కుటుంబం నుండి వచ్చి.. తండ్రీకొడుకులుగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించిన ఘనత మాత్రం నందమూరి తారకరామారావు, నందమూరి బాలకృష్ణలకే(Balakrisha) దక్కుతుంది. వెండితెరపై వీరిద్దరి కలయిక ఒక అద్భుతం. టాలీవుడ్ హిస్టరీలోనే మరే ఇతర తండ్రీకొడుకులకు సాధ్యం కాని రీతిలో ఏకంగా 12 సినిమాల్లో కలిసి నటించి, ఒక రేర్ రికార్డ్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. 

నటసింహం బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడమే ఒక సంచలనం. 1974లో ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన ‘తాతమ్మ కల(TatammaKala)’ చిత్రంతో బాలయ్య బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. తొలి అడుగులోనే తండ్రి మార్గదర్శకత్వంలో నటనలోని ఓనమాలు నేర్చుకున్న బాలకృష్ణ, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలనే తేడా లేకుండా తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటూ నటుడిగా తన స్థాయిని పెంచుకున్నారు.

వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు కేవలం మల్టీస్టారర్లు మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విజువల్ వండర్స్. ‘దాన వీర శూర కర్ణ(Daana Veera Soora Karna)’ వంటి పౌరాణిక అద్భుతం నుండి ‘అన్నదమ్ముల అనుబంధం’, ‘అక్బర్ సలీం అనార్కలి’, ‘శ్రీ మద్విరాట పర్వము’, ‘శ్రీ తిరుపతి వెంక‌టేశ్వర కళ్యాణం’ వరకు ప్రతి సినిమా ప్రేక్షకులను అలరించింది. అలాగే ‘అనురాగ దేవత’, ‘సింహం నవ్వింది’, ‘వేములవాడ భీమకవి’ వంటి చిత్రాలు ఈ కాంబినేషన్ క్రేజ్‌ను స్కై హైకి తీసుకెళ్లాయి.

నందమూరి అభిమానులకే కాకుండా సగటు సినిమా ప్రేమికుడికి కూడా ఎన్టీఆర్(NTR), బాలయ్యలను ఒకే ఫ్రేమ్‌లో చూడటం ఒక కనుల పండుగ. వీరు కలిసి చేసిన సినిమాల్లో అత్యధిక శాతం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించడం విశేషం. తరాలు మారినా, ట్రెండ్‌లు మారినా.. ఒకే క్రేజ్‌తో, ఒకే రీతిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ తండ్రీకొడుకుల అరుదైన రికార్డును బ్రేక్ చేయడం భవిష్యత్తులో ఎవరికైనా సాధ్యమేనా అంటే కష్టమే అనే సమాధానం వస్తుంది. అందుకే ఈ కాంబో టాలీవుడ్ హిస్టరీలోనే వన్ అండ్ ఓన్లీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్!

Tags
NTR Balakrishna NBK Sr NTR Tollywood Nandamuri Balakrishna Tollywood Records
Recent Comments
Leave a Comment

Related News