IPLలో వైభవ్ సూర్యవంశీ సంపాద‌న ఎంతో తెలుసా?

admin
Published by Admin — May 29, 2026 in National
News Image

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఎంతోమంది యువ ఆటగాళ్ల జీవితాలను రాత్రికి రాత్రే మార్చేసింది. కానీ, బీహార్‌కు చెందిన కేవలం 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న సంచలనాలు మాత్రం క్రికెట్ ప్రపంచాన్ని ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. మైదానంలో సిక్సర్ల వర్షం కురిపిస్తూ రికార్డుల వేట సాగిస్తున్న ఈ టీనేజ్ సెన్సేషన్ ఆస్తి, సంపాదన వివరాలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో చర్చ నడుస్తోంది. ఇంతకీ ఈ చిన్న వయసులోనే వైభవ్ సంపాదన ఏ స్థాయిలో ఉందో తెలుసా?

బీహార్‌లోని తాజ్‌పూర్‌కు చెందిన ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వైభవ్(Vaibhav Suryavanshi) ప్రయాణం అత్యంత స్ఫూర్తిదాయకం. ఒకప్పుడు తాజ్‌పూర్‌లోని తన రూ. 40 లక్షల విలువైన పెంకుటింటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలోనే వైభవ్ తండ్రి పర్యవేక్షణలో క్రికెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. కానీ, ఈరోజు తన అద్భుతమైన టాలెంట్‌తో కోట్లాది రూపాయల విలువైన సామ్రాజ్యాన్ని నిర్మించుకునే స్థాయికి ఎదిగాడు. ఐపీఎల్‌ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఇతడిని ఏకంగా రూ.1.10 కోట్ల భారీ ధరతో సొంతం చేసుకుంది. ఈ లెక్కన లీగ్‌లో ఆడే ఒక్కో మ్యాచ్‌కు ఈ కుర్రాడు సుమారు రూ. 7.5 లక్షల వరకు మ్యాచ్ ఫీజుగా అందుకుంటున్నాడని నెటిజన్లు లెక్కలు వేస్తున్నారు.

కేవలం ఐపీఎల్ శాలరీ మాత్రమే కాకుండా, వైభవ్ ప్రతిభకు తగ్గట్లుగా భారీగానే నజరానాలు అందుతున్నాయి. 2026 అండర్-19 వరల్డ్ కప్‌లో భారత్ తరఫున క్లాసిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు గానూ బీహార్(Bihar) ప్రభుత్వం ఇతడికి రూ. 50 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. వైభవ్ ఇటీవల ముంబై నగరంలో రూ. 3 కోట్ల విలువైన ఒక లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఆటతో పాటు వైభవ్‌కు లగ్జరీ కార్ల రూపంలోనూ అదృష్టం వరించింది. ఐపీఎల్‌లో తన మెరుపు బ్యాటింగ్‌తో టాటా కర్వ్ ఈవీ (Tata Curvv EV) కారును సొంతం చేసుకున్నాడు. ఇది చాలదన్నట్లు, రాజస్థాన్ రాయల్స్ మాజీ ఓనర్ వైభవ్ ఆటతీరుకు ఫిదా అయి ఒక బెంజ్ కారును గిఫ్ట్‌గా ఇచ్చినట్లు టాక్. నిన్నమొన్నటి వరకు బీహార్‌లోని ఒక చిన్న గ్రౌండ్‌లో చెమటోడ్చిన ఈ చిన్న వయసు క్రికెటర్.. నేడు కోట్లాది రూపాయల ఆస్తులు, లగ్జరీ కార్లతో ఇండియాలోనే అత్యంత సంపన్న యువ అథ్లెట్లలో ఒకడిగా నిలిచాడు.

Tags
Vaibhav Suryavanshi IPL 2026 Cricket News Vaibhav Suryavanshi Net Worth Vaibhav Suryavanshi IPL Salary Rajasthan Royals
Recent Comments
Leave a Comment

Related News