ప్రభాస్ వర్సెస్ బాలయ్య.. డిసెంబర్‌లో ద‌బిడిదిబిడే..!

admin
Published by Admin — June 29, 2026 in Movies
News Image

ఒకప్పుడు టాలీవుడ్‌(Tollywood)లో నవంబరు, డిసెంబరు నెలలంటే డల్ సీజన్ అనే ముద్ర ఉండేది. పెద్ద సినిమాలేవీ ఆ సమయంలో థియేటర్ల వైపు రావడానికి సాహసించేవి కావు. కానీ, కాలం మారింది.. ట్రెండ్ మారింది. వింటర్ సీజన్ కూడా కలెక్షన్ల వర్షం కురిపించగలదని ఇటీవలి కాలంలో రుజువైంది. ఇదే ఊపులో ఈ ఏడాది డిసెంబరులో బాక్సాఫీస్ వద్ద మైండ్ బ్లోయింగ్ వార్‌కి స్క్రీన్ ప్లే సిద్ధమవుతోంది. ఇద్దరు భారీ మాస్ కటౌట్లు ఒకేసారి థియేటర్లపైకి దండయాత్రకు వస్తుండటంతో అప్పుడే ట్రేడ్ వర్గాల్లో హీట్ పెరిగిపోయింది.

న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), గ్లోబల్ స్టార్ ప్రభాస్.. ఈ ఇద్దరు టాలీవుడ్ జెయింట్స్ డిసెంబర్ రేసులో ముఖాముఖి తలపడేందుకు రెడీ అవుతున్నారు. ఒకవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' డిసెంబరు 3ని టార్గెట్ చేయగా, మరోవైపు మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలయ్య చేస్తున్న ఊరమాస్ ఎంటర్‌టైనర్ డిసెంబరు 4న థియేటర్లలోకి వచ్చేందుకు ప్లాన్ సిద్దం చేసుకుంది. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే ఈ రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండటంతో టాలీవుడ్‌లో దబడదిబడే అనిపిస్తోంది.

నిజానికి ప్రభాస్(Prabhas) సినిమా అనుకున్న సమయానికి రావడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా బిజినెస్ డీల్స్, ముఖ్యంగా ఓటీటీ ఒప్పందాలు అన్నీ డిసెంబరు రిలీజ్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఒకవేళ ఈ విండో మిస్సైతే భారీ ఓటీటీ డీల్స్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉండటంతో.. చిత్రబృందం రాత్రింబగళ్లు శ్రమిస్తోంది. డిసెంబర్ మొదటి వారంలో 'ఫౌజీ'ని స్క్రీన్లపైకి తేవడం చిత్ర యూనిట్‌కు అత్యంత కీలకంగా మారింది.

ఇక గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna) సినిమా విషయానికొస్తే.. నిజానికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ దసరా పండగకే థియేటర్లలో సందడి చేయాల్సింది. కానీ, మేకింగ్‌లో క్వాలిటీ కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని భావించిన మేకర్స్.. దసరా రేస్ నుండి తప్పుకుని ప్లాన్ బిగా డిసెంబరు మొదటి వారాన్ని లాక్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పవర్‌ఫుల్ టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. త్వరలోనే అఫీషియల్ టైటిల్‌తో పాటు.. రిలీజ్ డేట్‌పై అధికారిక ముద్ర పడనుంది. కాగా, టాలీవుడ్‌లోని ఇద్దరు టాప్ హీరోలు కేవలం 24 గంటల గ్యాప్‌లో థియేటర్లలోకి రావడం అనేది సినీ ప్రియులకు పూనకాలు తెప్పించే విషయమే. ఒకరు క్లాస్ అండ్ యాక్షన్ కాంబోతో వస్తుంటే, మరొకరు పక్కా కమర్షియల్ మాస్ మసాలాతో ల్యాండ్ అవుతున్నారు. మరి ఈ డిసెంబర్ బాక్సాఫీస్ పందెంలో ఎవరు విన్నర్‌గా నిలుస్తారో, ఎవరి రికార్డులు బద్దలవుతాయో చూడాలి.

Tags
Prabhas Vs Balayya December Tollywood Prabhas Balakrishna Fauji Gopichand Malineni Hanu Raghavapudi
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News