అదృష్టమంటే ఇదే.. వ‌రుస ఫ్లాపుల్లో శ్రీ‌లీల‌కు గోల్డెన్ ఛాన్స్‌.!

admin
Published by Admin — August 07, 2026 in Movies
News Image

టాలీవుడ్‌(Tollywood)లో ఒకప్పుడు ఏ సినిమా చూసినా ఈ ముద్దుగుమ్మే కనిపించేది. వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతూ, కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీకి కొద్దికాలంగా కాలం కలిసి రావడం లేదు. ఎంత వేగంగా స్టార్‌డమ్ అందుకుందో, అంతే వేగంగా బాక్సాఫీస్ వద్ద పరాజయాలు పలకరించాయి. చేతిలో సినిమాలు ఉన్నప్పటికీ, అవి ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో ఈ క్యూట్ హీరోయిన్ కెరీర్‌పై రకరకాల రూమర్లు వినిపించాయి. దానికి తోడు తాను మధ్యలో వదిలేసిన ప్రాజెక్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఈ బ్యూటీకి కాస్త నిరాశ కలిగించింది.

ఇలాంటి డీలా పడ్డ తరుణంలోనే శ్రీలీల(Sreeleela)కు విధి ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. కష్టకాలంలోనూ తలరాతను మార్చేసే గోల్డెన్ ఛాన్స్ ఈ అమ్మడి తలుపు తట్టింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఈ చిన్నదానీకి ఏకంగా ఇండియన్ సినిమా బాస్, సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రంలో నటించే అరుదైన అవకాశం దక్కినట్లు ఫిలింనగర్ వర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం రజనీకాంత్(Rajinikanth) హీరోగా, అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ 'ధర్మాన్'. కోలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ కమల్ హాసన్ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ భారీ ప్రాజెక్టులోనే శ్రీలీల ఒక కీలక పాత్రకు ఎంపికైనట్లు సమాచారం. ఈ చిత్రంలో రజనీకాంత్ డాక్టర్ పాత్రలో కనిపించబోతుండగా, ఆయనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకునే ఈ గోల్డెన్ ఆఫర్ శ్రీలీల కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ కానుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ ఏడాది ఇప్పటికే పవన్ కల్యాణ్(Pawan Kalyan) 'ఉస్తాద్ భగత్ సింగ్'తో పాటు శివ కార్తికేయన్ సరసన 'పరాశక్తి' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీలీలకు ఆశించిన ఫలితాలు దక్కలేదు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోలేకపోయాయి. మరోవైపు బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తున్న సినిమాతో త్వరలోనే నార్త్ ఆడియెన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఇలాంటి బిజీ షెడ్యూల్ మధ్యలో రజనీకాంత్ లాంటి లెజెండరీ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేయడం నిజంగానే ఆమె రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందని చెప్పవచ్చు. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Tags
Sreeleela Rajinikanth Dharman Thalaivar 173 Tollywood Kollywood South Cinema Sreeleela Movies
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News