ముదురు ముం*.. చిన్నారిపై ఆ మాట‌లేంటి ర‌వితేజ‌..?

admin
Published by Admin — August 17, 2026 in Movies
News Image

మాస్ మహారాజా రవితేజ అంటేనే అంతులేని ఎనర్జీ, నిరంతరం నవ్వుతూ కనిపించే ఒక పాజిటివ్ వైబ్. ఎప్పుడూ తన సినిమాలతో, హుషారైన ప్రవర్తనతో ప్రేక్షకులను అలరించే ఆయన, రీసెంట్‌గా హైదరాబాద్‌లో జరిగిన ‘ఇరుముడి(Irumudi)’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లోనూ అదే జోష్‌తో కనిపించారు. చాలా కాలం తర్వాత ఆయన్ని అంత ఉత్సాహంగా చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ, ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. అదే వేదికపై ఆయన నోటి నుంచి వచ్చిన ఒక పదం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది.

ఈవెంట్‌లో భాగంగా సినిమాలో తన కూతురిగా నటించిన మలయాళీ నటి నక్షత్రతో ముచ్చటిస్తున్న సమయంలో రవితేజ వాడిన ఒక పదం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఆమెను ఉద్దేశించి ఆయన “ముదురు ముం*డా” అనడం అక్కడివారితో పాటు చూస్తున్న ప్రేక్షకులను విస్మయానికి గురిచేసింది. ఎప్పుడూ కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉండే రవితేజ(Ravi Teja) లాంటి స్టార్ హీరో, పబ్లిక్ స్టేజ్ మీద ఒక చిన్నారితో ఇలా మాట్లాడటం ఏంటని నెటిజన్లు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు.

కొందరు దీన్ని తెలంగాణ(Telangana) ప్రాంతంలో వాడే యాసగా, సరదాగా అనే మాటే కదా అని సమర్ధించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, నేటి యువతరం మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఎంత లోకల్ టెర్మ్ అయినా, పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌పై ఒక నటిని అలా సంబోధించడం సరికాదని మండిపడుతున్నారు. ఇప్పటివరకు రవితేజ పర్సనాలిటీపై ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు, కానీ ఈ చిన్న టంగ్ స్లిప్ ఆయన ఇమేజ్‌కు చిన్న మచ్చలా మారింది. మాస్ మహారాజ్ తన హుషారుతో ఆడియన్స్‌ను ఎంత దగ్గర చేసుకుంటారో, ఇలాంటి మాటలు మాత్రం అంతే వేగంగా దూరం చేస్తాయని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.

Tags
Ravi Teja Irumudi Movie Irumudi Pre Release Event Mass Maharaja Tollywood Shiva Nirvana Telugu Cinema
Recent Comments
Leave a Comment

Related News