శ్రీ‌మ‌తి కోరిక‌.. త్రివిక్ర‌మ్ తీరుస్తారా..?

admin
Published by Admin — August 16, 2026 in Movies
News Image

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas)  ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక బలమైన కారణం ఉంటుంది. అయితే, ఆయన సినిమాల ఎంపిక విషయంలోనూ, క్యాస్టింగ్ విషయంలోనూ కుటుంబ సభ్యుల ప్రభావం ఎంతో కొంతో ఉంటుందనే ప్రచారం ఎప్పట్నుంచో ఉంది. కానీ, తాజాగా ఆయన స్వయంగా బయటపెట్టిన ఒక ఆసక్తికరమైన నిజం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే, ఏకంగా ఆయన సతీమణే ఓ స్టార్ హీరో సినిమా కోసం పట్టుబడుతుండటం విశేషం.

కోలీవుడ్ స్టార్ సూర్యకు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన డబ్బింగ్ సినిమాలకు సైతం ఇక్కడ స్ట్రైట్ సినిమాల రేంజ్‌లో ఓపెనింగ్స్ వస్తుంటాయి. ఇక తాజా చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్(vishwanath and sons)' సక్సెస్ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన త్రివిక్రమ్.. సూర్యతో తనకున్న అనుబంధం గురించి, ఒక క్రేజీ ప్రాజెక్ట్ గురించిన హింట్స్ ఇచ్చి అభిమానులను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యపై తన ఇంట్లో ఉన్న అభిమానం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

సాధారణంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో జరిగే షూటింగ్‌లకు త్రివిక్రమ్ సతీమణి సౌజ‌న్య‌ పెద్దగా వెళ్లడం చాలా అరుదు. కానీ, సూర్య(Suriya) సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మాత్రం ఆమె స్వయంగా స్పాట్‌కు వెళ్లారట. అంతేకాదు, సూర్య అంటే తనకు ప్రాణమని, ఆయనతో త్రివిక్రమ్ త్వరగా ఒక సినిమా చేయాల్సిందేనని ఆమె గట్టిగా డిమాండ్ చేస్తున్నారట. డైరెక్టర్ భార్యే స్వయంగా రంగంలోకి దిగి ఈ కాంబినేషన్ కోసం పట్టుబడుతుందంటే.. రాబోయే రోజుల్లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మరి ఇంటి నుంచి వస్తున్న ఈ బలమైన ఒత్తిడికి త్రివిక్రమ్ తలవంచి, సూర్యతో టాలీవుడ్‌లో ఒక అద్భుతమైన సినిమాను ప్లాన్ చేస్తారేమో చూడాలి.

Tags
Suriya Trivikram Vishwanath And Sons Suriya Trivikram Combo Tollywood Kollywood Soujanya
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News