బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) మరియు తానా (TANA) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన వనభోజనాల కార్యక్రమం చిరు జల్లుల పలకరింపు, పులకరింపుతో ఘనంగా జరిగింది. వందలాది మంది ప్రవాస భారతీయులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని కార్యవర్గ సభ్యులు ప్రతీ సంవత్సరం లాగే గొప్పగా నిర్వహించారు. ప్రవాస పెద్దలకు వినోదం, ఎన్నో రుచికరమైన వంటకాలు, ఆరుబయట గ్రిల్ మరియు వినోదంతో ఆసాంతం ఆహ్లాదకరంగా, సంతోషంగా గడిపారు.
ఉదయం 10 గంటల నుండి హన్సన్ పార్కులో వందలాదిమందికి రుచికరమైన విందును అందించి ఆటపాటలతో పూర్తి కాలక్షేపాన్ని అందించారు.. తరాల అంతరం, తల్లిదండ్రులు పిల్లల అనుబంధాలు గురించి, మాతృభాషను ఈ తరం చిన్నారులకు అందించే పాఠశాల వేదిక గురించి జరిగిన చర్చలో పాల్గొన్నపెద్దలు, తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను పంచుకొని, తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ రోజంతా సందడిగా చిన్నారుల కేరింతలతో సంతోషంగా గడిపామని ఇదే ఐక్యతను కొనసాగిస్తూ అందరూ కలిసి మెలిసి ఉండాలని తమ అనుభవాన్ని వెలిబుచ్చారు.
కొద్దిపాటి ప్రతికూల వాతావరణంలో కూడా కార్యక్రమ నిర్వహణకు సమిష్టిగా సహకరించిన వాలంటీర్లకు నిర్వాహకులు తానా అధ్యక్షులు నరేన్ కొడాలి, GWTCS అధ్యక్షులు రవి అడుసుమిల్లి తమ కృతఙ్ఞతలు తెలిపారు. తానా, GWTCS కార్యవర్గ సభ్యులు అనుబంధ విభాగాల సభ్యులు సుధీర్ కొమ్మి, యష్ బొడ్డులూరి, భాను మాగులూరి , సుశాంత్ , రాజేష్ , కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.