కూటమి పార్టీలను తక్కువగా అంచనా వేయడం వైసీపీ(YCP)కి కామన్‌గా మారిపోయింది. ముఖ్యంగా కూటమిలో చిచ్చు రగిలితే.. ముందుగా ఆనందించేంది కూడా వైసీపీనే. ఈ విషయంలో తిరుగులేదు. ఎక్కడ ఏ నాయకులు కొంత కూటమికి వ్యతిరేకంగా కామెంట్లు చేసినా.. ఆ వెంటనే వైసీపీ వాలిపోతోంది. తద్వారా.. కూటమిలో చిచ్చు వచ్చిందని.. ఇక, ఈ కూటమి నిలవదని ప్రచారం చేస్తుంది. కానీ.. ఈ వివాదాలను పక్కన పెట్టి కూటమి పెద్దలు ఐక్యంగా ముందుకు సాగుతున్నారు. ఇది వైసీపీకి ఎదురవుతున్న ప్రధాన రాజకీయ పాఠం.
అయినప్పటికీ.. కూటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండానే వైసీపీ అడుగులు వేస్తోంది. తాజాగా స్థానిక ఎన్నికల్లో విజయవాడ(Vijayawada), గుంటూరు, విశాఖల్లోని కొన్ని వార్డుల్లో వైసీపీ నేతలు గెలిచారు. మేయర్ అభ్యర్థులు ఓడిపోయినా.. కొన్ని కొన్ని వార్డుల్లో మత్రం.. వైసీపీ నేతలు పోరాడి గెలిచారు. అయితే.. అంతా అయిపోయిందని.. ఇక, వచ్చే ఎన్నికల వరకు తిరుగులేదని అనుకుంటే పొరపాటేనని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. కూటమి స్ట్రాటజీ వేరుగా ఉంది. వైసీపీకి మరో ఝలక్ ఇచ్చేందుకు కూటమి నేతలు నిర్ణయించారు.
ఇది పైస్థాయిలో నిర్ణయం కాకపోయినా.. క్షేత్రస్థాయిలో కూటమి పార్టీలు పావులు కదుపుతున్నారు. తాజాగా గెలిచిన వైసీపీ కార్పొరేటర్లను కూడా ఆ పార్టీకి లేకుండా చేయాలన్నది వ్యూహం. ఇది రాజకీయంగా తప్పుబట్టలేని అంశం. ఎందుకంటే.. పార్లమెంటు స్థాయిలోనే ప్రత్యర్థులను లేకుండా చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్న ఈ రోజుల్లో క్షేత్రస్థాయిలో చేస్తే తప్పులేదన్న భావన ఉంది. ఈ క్రమంలో విశాఖ(Vishaka)లో గెలిచిన 13 మంది కార్పొరేటర్లకు.. అప్పుడే ఫోన్లు వెళ్తున్నాయని అంటున్నారు.
వ్యక్తిగతంగానే కాకుండా.. మీరు వైసీపీలో ఉంటే ఏమీ చేయలేరు.. మా పార్టీల్లోకి వచ్చేయండి.. అంటూ కీలక పార్టీల నాయకులు ఆఫర్లు ఇస్తున్నారు. ఇక, ఎంత కరడుగట్టిన వైసీపీ నాయకుడు అయినా.. పార్టీ పరంగా ముఖ్యంగా జగన్(Jagan) పరంగా గ్రాఫ్ పెరుగుతుందన్న అంచనాలు లేనప్పుడు.. పక్క చూపులు చూడడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు.. వైసీపీనే నమ్ముకుని కూర్చుంటే.. రెండున్నరేళ్లపాటు ఇబ్బందులు తప్పవన్న అంచనాలు కూడా ఉన్నాయి. పైగా ఇప్పుడు పెట్టిన ఖర్చు ను కూడా వెనక్కి తీసుకునేందుకు అవకాశాలు సన్నగిల్లుతాయి. సో.. మొత్తంగా ఆయా కార్పొరేషన్ల పరిధిలో వైసీపీ నేతలు జంప్ చేయడం ఖాయమని అంటున్నారు. మరి దీనిని జగన్ ఎలా నిలుపుదల చేస్తారో చూడాలి.