శేఖ‌ర్ మాస్ట‌ర్ కారుకు ఘోర ప్ర‌మాదం.!

admin
Published by Admin — November 12, 2026 in Movies
News Image

టాలీవుడ్‌(Tollywood)లో మోస్ట్ పాపులర్ డాన్స్ మాస్టర్‌గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న శేఖర్ మాస్టర్ ఘోర ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ భారీ లారీ వెనుక నుంచి వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ అనూహ్య ఘటనతో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలోనూ, ఆయన అభిమానుల్లోనూ తీవ్ర కలకలం రేగింది.

బుధవారం రాత్రి వరకు ఎంతో ఉత్సాహంగా (Chiranjeevi) 'కాక' సినిమాలోని సాంగ్‌ షూటింగ్ పనుల్లో బిజీగా గడిపిన శేఖర్ మాస్టర్, అర్ధరాత్రి దాటిన తర్వాత తన కారులో తిరుగు ప్రయాణమయ్యారు. హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ప్రాంతానికి చేరుకునే సరికి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పండ్ల లోడ్‌తో అతివేగంగా దూసుకొచ్చిన ఒక పెద్ద లారీ అదుపుతప్పి ఆయన కారును వెనుక నుంచి బలంగా గుద్దేసింది.

ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే.. లారీ ఢీకొన్న ధాటికి కారు వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. కారులో ఉన్నవారికి ప్రాణాపాయం తప్పదనే భయం కలిగించేలా ఈ ఘటన ఉండింది. అయితే, అదృష్టవశాత్తూ ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడం, ఇతర సేఫ్టీ ఫీచర్లు సరిగ్గా పనిచేయడంతో శేఖర్ మాస్టర్‌(Sekhar Master)తో పాటు ప్రయాణిస్తున్న మిగతావారంతా స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడగలిగారు.

ఈ ప్రమాద(Accident) వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ అభిమాన మాస్టర్ క్షేమంగా ఉన్నారనే వార్త తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, లారీ డ్రైవర్ నిర్లక్ష్యమా లేక వేరే ఏదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు.

Tags
Sekhar Master Tollywood Sekhar Master Accident Hyderabad News Chiranjeevi Kaaka Movie
Recent Comments
Leave a Comment

Related News