దిల్ రాజుతో ప‌వ‌న్ వ‌న్స్ మోర్‌.!

admin
Published by Admin — November 13, 2026 in Movies
News Image

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుల కలయిక ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ తాజాగా స్నేహపూర్వక వాతావరణంలో భేటీ కావడం, ఆ విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం సినీ వర్గాల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. గతంలో వీరి కలయికలో వచ్చిన ‘వకీల్ సాబ్’ చిత్రం వచ్చి విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఈ విజయవంతమైన కాంబినేషన్ రిపీట్ కానుందనే వార్తలు అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతున్నాయి.

రాజకీయ బాధ్యతలతో అత్యంత బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్, మరోవైపు సినిమాలనూ బ్యాలెన్స్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో, ఆ లోపు తన కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే దిల్ రాజుతో జరిగిన సమావేశంలో తక్కువ కాలపరిమితిలో షూటింగ్ పూర్తయ్యే ఒక సరికొత్త సబ్జెక్ట్‌ను ప్లాన్ చేయమని కోరినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నెలకు పదిహేను రోజుల పాటు కాల్షీట్లు కేటాయించి, కేవలం నాలుగు నెలల్లోనే సినిమాను కంప్లీట్ చేసేలా ఒక పక్కా ప్రణాళిక రూపొందించమని పవన్‌(Pawan) చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే, ఈ ప్రాజెక్ట్ పై ఎటువంటి అధికారక ప్రటకన లేనప్పటికీ.. పవన్ అభిమానుల నుంచి మాత్రం ఒక స్పష్టమైన డిమాండ్‌ వినిపిస్తోంది. రీమేక్స్‌ కాకుండా పవర్ ప్యాక్డ్ ఒరిజినల్ కంటెంట్‌తో సినిమాను తెరకెక్కించాలని వారు కోరుకుంటున్నారు. ఇక దిల్ రాజు(Dil Raju) లాంటి అనుభవజ్ఞుడైన నిర్మాత రంగంలోకి దిగితే పవన్‌కు సరిపోయే కథను, పర్ఫెక్ట్ దర్శకుడిని ఎంపిక చేయడం పెద్ద పనేమి కాదు. సో.. ఈ కాంబోకు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటూ జోరుగా చర్చ సాగుతోంది. మరి దిల్ రాజు - పవన్ కల్యాణ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాల్సిందే.

Tags
Pawan Kalyan Tollywood Dil Raju Telugu Movies Pawan Kalyan Movies
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News