ఏపీ, తెలంగాణలోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. విజనరీ లీడర్ గా, పరిపాలనలో డిజిటల్ సంస్కరణలు తెచ్చిన దార్శనీకుడిగా ఆయనకు సెపరేట్ గా ఓ ఫ్యాన్ బేస్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. 90's సీఎం చంద్రబాబుకు సీఈవో సీఎం అని కొందరు పిలుచుకునేవారు. సీఈవో తరహాలో రాష్ట్రాన్ని చంద్రబాబు పాలించిన తీరు ఎందరికో ఆదర్శప్రాయమైంది. అయితే రైతు వ్యతిరేకి అని ముద్రపడ్డ చంద్రబాబు ఆ ముద్రను చెరిపి వేసుకొని వాటర్ మ్యాన్ సీఎంగా రూపాంతరం చెందిన తీరు ప్రశంసనీయం.
పాత చంద్రబాబు- CEO CM:
హైదరాబాద్ Hitech City లోని Cyber Towers బిల్డింగ్ దశాబ్దాలపాటు చంద్రబాబు పొలిటికల్ ఐడెంటిటీ గా కొనసాగింది. 1995-2003 వరకు సీఈవో సీఎం అంటూ ఐటీ రంగం పిలుచుకునే చంద్రబాబు ముందుచూపు వల్లే గ్లోబల్ ఇన్వెస్టర్లు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టారు. Microsoft, Google, Indian School of Business, IRDA వంటి అన్ని ప్రతిష్టాత్మక సంస్థలు, కంపెనీల భారత హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ లో ఉన్నాయంటే అది చంద్రబాబు చలవే.
చంద్రబాబుకు రైతు వ్యతిరేకి ముద్ర:
అయితే, చంద్రబాబు విజన్ అందరికీ అర్థం కాలేదు. చంద్రబాబును అర్బన్ లీడర్ అని కొందరు భావించారు. అందుకే, 2004 లో ఓటమి పాలయ్యారు. వర్షాభావం వల్ల తీవ్ర కరువు రావడం, అర్బన్ సీఎం అని పేరు పడడం వంటి కారణాలతో చంద్రబాబు "రైతు వ్యతిరేకి" అనే ముద్ర పడిపోయింది. ఈ విషయాన్ని TDP పోలిట్ బ్యూరో సభ్యులు అంతర్గతంగా చర్చించుకుంటూ ఉంటారు.
కొత్త చంద్రబాబు-Pipes CM
అయితే, ఇప్పుడు చంద్రబాబు పూర్తిగా మారిపోయారు. గతంలో తనపై పడ్డ ముద్రలను చెరిపేస్తూ నవతరానికి తగ్గట్లుగా తనను తాను మార్చుకున్నారు. ఓ పక్క కార్పొరేట్ సంస్థలను, ఐటీ,ఏఐ రంగాలను డెవలప్ చేస్తూనే..మరోపక్క రైతాంగానికి ఆయువు పట్టు వంటి నీటి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. తన నాలెడ్జ్ ను సాఫ్ట్ వేర్ పార్కుల నుండి వాటర్ పైపులకు మళ్ళించారు ఆయన. సీఈవో సీఎం నుంచి వాటర్ పైప్ సీఎంగా...వాట్ ఎ మ్యాన్ నుంచి వాటర్ మ్యాన్ గా చంద్రబాబు రూపాంతరం చెందిన వైనం అద్భుతం.
ఏపీకి జీవనాడి వంటి పోలవరం Left Main Canal ద్వారా నీరు విడుదల చేయడం, వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభోత్సవం వంటి కార్యక్రమాలతో చంద్రబాబు వాటర్ మ్యాన్ అనే స్టాంప్ వేయించుకున్నారు.
అంతేకాదు, కొత్త మెగా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం కాకుండా, పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ పనులను పూర్తి చేయడమే తన లక్ష్యమని చంద్రబాబు స్పష్టమైన సంకేతాలిచ్చారు.
రైతు వ్యతిరేకి ముద్ర చెరిపేసిన బాబు:
90వ దశకంలోనే డ్రిప్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్, హార్టి కల్చర్ ని ప్రోత్సహించిన ఘనత చంద్రబాబుది.పట్టిసీమతో గోదావరి-కృష్ణా లింక్ చేసింది కూడా ఆయనే. రైతు వ్యతిరేకి అని తనపై వైసీపీ వేసిన స్టాంప్ ను చెరిపివేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. మైక్రోసాఫ్ట్ ను హైదరాబాద్ కు తెచ్చిన అదే మనిషి....ఇప్పుడు ఏపీలోని చివరి ఆయకట్టుకు నీరు తేవడానికి ప్రయత్నిస్తున్నారు. తద్వారా టీడీపీకి గ్రామీణ ఓటర్లను మరింత చేరువ చేయడం ఆయన లక్ష్యం.
Pixels to Pipes..CBN's Re Branding:
Pixels (Cyber Towers) నుండి Pipes (Polavaram, Veligonda) మారి CEO-CM ఇమేజ్ నుంచి Water Man, Water Strategist గా తనను తాను రీ-బ్రాండ్ చేసుకుంటున్న చంద్రబాబు ఈ తరం రాజకీయ నాయకులకు ఒక రోల్ మోడల్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.