పొత్తులపై జగన్ తీరు మారిందా?

admin
Published by Admin — September 26, 2026 in Politics
News Image
వైసీపీ తీరు మారిన‌ట్టు క‌నిపిస్తోంది. తాజాగా జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎవ‌రితోనూ క‌లి సేది లేద‌న్న వైసీపీ అధినేత జ‌గ‌న్.. తాజాగా కామ్రెడ్స్‌తో చేతులు క‌లిపేందుకు రెడీ అయ్యారు. ఈ విష‌యాన్ని సీపీఐ నాయ‌కుడు రామ‌కృ ష్ణ స్వ‌యంగా మీడియాకు వెల్ల‌డించారు. తాజాగా జ‌గ‌న్‌తో క‌మ్యూనిస్టులు భేటీ అయ్యారు. సుమారు గంట‌న్న‌ర‌పాటు వివిధ అంశాల‌పై చ‌ర్చించారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు.. క‌లిసి ఉద్య‌మాలు చేయాల్సిన అవ‌స‌రం వంటివాటిపైచ‌ర్చించిన‌ట్టు చెబుతున్నారు.
 
అయితే.. వ‌చ్చే స్థానిక ఎన్నిక‌ల్లో వైసీపీతో క‌లిసి ముందుకు సాగాల‌న్న ల‌క్ష్యంతోనే క‌మ్యూనిస్టులు క‌లిసి ఉంటార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌త ఎన్నిక‌ల్లోనూ వైసీపీతో క‌లిసి న‌డిచేందుకు క‌మ్యూనిస్టులు ముందుకు వ‌చ్చారు. అయితే.. అప్ప‌ట్లోనే జ‌గ‌న్‌.. తాము ఎవ‌రితోనూ చేతులు క‌లిపేది లేద‌న్నారు. ఒంటరిగానే పోటీ చేస్తామ‌ని చెప్పారు. కానీ, ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాల‌య్యారు. ఆ త‌ర్వాత‌.. వ‌చ్చిన తొలి ఎన్నిక‌లు స్థానిక‌మే కావ‌డం.. కూట‌మి బ‌లంగా ఉండ‌డంతో.. ఇప్పుడు త‌న నిర్ణ‌యాన్ని స‌మీక్షించుకునే ప‌రిస్థితిని వైసీపీ ఎదుర్కొంటోంది.
 
ముఖ్యంగా క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు పార్టీని వ‌దిలిపోతున్నారు. గ‌తంలో మాదిరిగా త‌న ఇమేజ్ ఏమేర‌కు ప‌నిచేస్తుంద‌న్న‌ది కూడా జ‌గ‌న్‌కు సమ‌స్య‌గానే ఉంది. త‌న ఇమేజ్‌ను.. ఇప్ప‌టికే జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ సొంతం చేసుకున్నార‌న్న వాద‌న కూడా వినిపిస్తున్న ద‌రిమిలా.. ఇక‌పై ఒంట‌రి పోరు ప్ర‌మాద‌మ‌నే సంకేతాలు ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే క‌మ్యూనిస్టులు అడిగిందే త‌డువుగా వారితో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా చ‌ర్చించారు. ప్ర‌స్తుతం తాము ఎత్తుకున్న అజెండా.. ఇత‌ర అంశాల‌పైనా.. క‌మ్యూనిస్టులు క‌లిసి వ‌స్తామ‌ని చెప్ప‌డంతో వారిని ఆహ్వానించ‌డం గ‌మ‌నార్హం.
 
ఏం జ‌రుగుతుంది?
 
జ‌గ‌న్ వ్యూహాలు స‌హ‌జంగానే త‌న పార్టీ వ‌ర‌కే ప‌రిమితం అవుతాయి. కానీ, ఇప్పుడు త‌న పార్టీ పెద్ద‌గా పుంజుకుంటున్న ప‌రిస్థితి లేక‌పోవ డంతోపాటు క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా పార్టీకి దూర‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే చేయి అందించే వారి కోసం వైసీపీ ఎదురు చూస్తున్న ప‌రిస్థితి ఉంది. ఈ నేప‌థ్యంలోనే క‌మ్యూనిస్టుల‌తో క‌లిసి పుంజుకునేందుకు వైసీపీ అధినేత అడుగులు వేస్తున్నార‌న్న సంకేతాలు ఇస్తున్నారు. ఇదే జ‌రిగితే.. క్షేత్ర‌స్థాయిలో కమ్యూనిస్టుల‌కు బ‌లంగా ఉన్న కేడ‌ర్‌.. వైసీపీకి అనుకూలంగా మారే అవ‌కాశం ఉంది. త‌ద్వారా.. పోయిన ఓటు బ్యాంకుతోపాటు.. స‌మ‌స్య‌ల‌పై పోరాడేందుకు అవ‌కాశం మ‌రింత పెరుగుతుంద‌ని వైసీపీ అంచ‌నా వేస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags
jagan ycp cpi alliance changed mindset
Recent Comments
Leave a Comment

Related News