బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు సంచలన నిర్ణయం

admin
Published by Admin — October 05, 2026 in Politics
News Image

బీసీ రిజ‌ర్వేష‌న్ వ్య‌వ‌హారంపై రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీసీల‌కు 34 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని.. త‌ద్వారా బీసీల ప్ర‌గాఢ ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలోనే గ‌త నెల‌లో జీవోల‌ను కూడా జారీ చేశారు. అయితే.. దీనిని వ్య‌తిరేకిస్తూ.. కొంద‌రు హైకోర్టును ఆశ్రయించారు. ఫ‌లితంగా హైకోర్టు ఆయా జీవోల‌ను ర‌ద్దు చేసింది. సుప్రీంకోర్టు గ‌తంలో ఇచ్చిన తీర్పుల మేర‌కు జీవోలు చెల్లుబాటు కావ‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది. అయిన‌ప్ప‌టికీ.. రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ తీర్పును సుప్రీంకోర్టులో స‌వాల్ చేసింది. కానీ.. దీనిపై తీర్పు వ‌చ్చేందుకు స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా పార్టీ సీనియ‌ర్ నాయ‌కుల‌తో సీఎం చంద్ర‌బాబు టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉన్నా.. ముందుగానే ప్ర‌జ‌లను క‌లుసుకునేందుకు నాయ‌కులు రెడీగా ఉండాల‌నిఆయ‌న దిశానిర్దేశం చేశారు. బీసీల విష‌యంలో వైసీపీ నేత‌లు చేస్తున్న విష ప్ర‌చారాన్ని తిప్పికొట్టేందుకు ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. మండ‌ల‌, గ్రామీణ స్థాయి నుంచి నియోజ‌క‌వ‌ర్గం స్థాయి వ‌ర‌కు ప్ర‌తి నాయ‌కుడు.. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని.. బీసీల రిజ‌ర్వేష‌న్ విష‌యంలో వైసీపీ చేస్తున్న రాజ‌కీయాల‌ను వారికి వివ‌రించాల‌ని చంద్ర‌బాబు దిశానిర్దేశం చేశారు.

ముఖ్యంగా రెండు విష‌యాల‌ను చంద్ర‌బాబు పేర్కొన్నారు. 1) వైసీపీ చేస్తున్న‌ప్ర‌చారం: బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ విష‌యంలో వైసీపీ నేత‌లు చేస్తున్న ప్ర‌చారం.. వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌న్నారు. బీసీల‌కు ఆది నుంచి టీడీపీ అండ‌గా ఉంద‌ని, మంత్రి ప‌ద‌వుల నుంచి టికెట్ల వ‌ర‌కు కూడా బీసీల‌కు న్యాయం చేసింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే 1995 తర్వాత‌.. బీసీల‌కు 34 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించిన పార్టీ కూడా టీడీపీనేన‌ని పేర్కొన్నారు. అప్ప‌ట్లో కొంద‌రు అడ్డుకున్నార‌ని.. ఇప్పుడు వైసీపీ అడ్డం ప‌డుతోంద‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించి..వైసీపీ ప్ర‌చారాన్ని తిప్పికొట్టాల‌న్నారు.

2) సుప్రీంకోర్టు తీర్పు ఎలా వ‌చ్చినా.. ప్ర‌జ‌ల‌కు వివ‌రించేందుకు నాయ‌కులు రెడీకావాల‌న్నారు. ముఖ్యంగా బీసీ సామాజిక వ‌ర్గం నాయ‌కుల‌తో మ‌మేకం కావ‌డం.. వారికి జీవోల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వ‌డం, బీసీల‌కు ఏవిధంగా రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాం.. దీనికి సంబంధించిన చ‌ట్టాలు.. రాజ్యాంగం ఏం చెబుతోంది..? గ‌తంలో సుప్రీంకోర్టు ఎలాంటి వెసులుబాటు క‌ల్పించిందో వారికి వివ‌రించాల‌ని దిశానిర్దేశం చేశారు. పార్టీ కీల‌క నాయ‌కుల‌ను ముందుకు తీసుకువెళ్లే విష‌యంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు.బీసీల విష‌యంలో వైసీపీ చేస్తున్న ప్ర‌చారాన్ని ఎక్క‌డిక‌క్క‌డ తిప్పికొట్టాల‌ని సూచించారు.

Tags
Cm chandrababu took shocking decision on BC reservations
Recent Comments
Leave a Comment

Related News