నాని నోటి దురుసు.. పోలీసుల రిటర్న్ గిఫ్ట్!

admin
Published by Admin — April 03, 2026 in Politics, Andhra
News Image

మచిలీపట్నం(Machilipatnam) రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. మాజీ మంత్రి, వైకాపా నేత పేర్ని నాని తన పాత స్టైల్‌లోనే రెచ్చిపోయారు. కానీ, ఈసారి సీన్ కాస్త రివర్స్ అయింది. అక్రమ కట్టడాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ఉన్న నేత, అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న అధికారులనే బెదిరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మచిలీపట్నం కొబ్బరితోటలో అనుమతి లేని కట్టడాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేస్తుంటే, అక్కడకు చేరుకున్న పేర్ని నాని(Perni Nani) సినిమా లెవల్లో రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న మున్సిపల్ కమిషనర్, పోలీసులపై నోరుపారేసుకోవడమే కాకుండా.. ``మా ప్రభుత్వం వచ్చాక మీ అంతు చూస్తాం, ఎక్కడికి వెళ్లినా వదలం`` అంటూ బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు. అధికారం ఉన్నా లేకపోయినా తన మార్కు రాజకీయం తగ్గలేదని నిరూపించుకునే ప్రయత్నం చేశారు.

అయితే, నాని హెచ్చరికలకు అధికారులు భయపడతారని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. యూనిఫాంలో ఉన్న తమను వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా, విధులకు ఆటంకం కలిగించడాన్ని పోలీసు అధికారుల సంఘం సీరియస్‌గా తీసుకుంది. వెనుకా ముందు ఆలోచించకుండా నాని చేసిన వ్యాఖ్యలపై చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.  నాని(Nani) అధికారులకు వార్నింగ్ ఇస్తే, పోలీసులు ఆయనకు కేసు రూపంలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు.

Tags
Perni Nani Machilipatnam AP Politics Perni Nani Case Andhra Pradesh YSRCP
Recent Comments
Leave a Comment

Related News